Share News

kumaram bheem asifabad- ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - May 26 , 2026 | 10:25 PM

కుమరం భీం జిల్లా కెరమెరి మండలం కోటారి గ్రామంలో జూన్‌ 1న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె హరిత అధికారులను ఆదేశించారు. కోటారి గ్రామాన్ని మంగళవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, రాష్ట్ర ఇంజనీరింగ్‌ ముఖ్య అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం హెలిప్యాడ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఏర్పాట్లు సంపూర్ణంగా పూర్తి చేయాలని ఆదేశించారు

kumaram bheem asifabad- ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
కోటారిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిపాబాద్‌రూరల్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లా కెరమెరి మండలం కోటారి గ్రామంలో జూన్‌ 1న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె హరిత అధికారులను ఆదేశించారు. కోటారి గ్రామాన్ని మంగళవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, రాష్ట్ర ఇంజనీరింగ్‌ ముఖ్య అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం హెలిప్యాడ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఏర్పాట్లు సంపూర్ణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలో అంతర్గత రహదారులు, మురికి కాలువల పూడిక తీత పనేఉలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అన్నారు. గ్రామంలో నిరుపయోగంగా ఉన్న పాత నిర్మాణాలను, మురికి కాలువల వద్ద ఉన్నత చెత్త చేదారాన్ని వెంటనే తొలగించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ప్రారంభించబోయే సీసీ రహదారి ఇరువైపులా ముగ్గులు వేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు సర్వం సిద్ధం చేయాలని అన్నారు. గృహాలను చక్కగా అలంకరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల ముందు పరిసరాలు చాలా శుభ్రంగా ఉండాలన్నారు. సీఎం లబ్ధిదారులతో నేరుగా ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉన్నందున అందుకోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేయాలని సూచిచారు. కార్యక్రమంలో డీపీవో భిక్షపతి, పీడీ ప్రకాష్‌రాజ్‌, ఇంజనీరింగ్‌ శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): ముఖ్యమత్రి రేవంత్‌రెడ్డి జూన్‌ 1న పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం కెరమెరి మండలం కోటారి గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్‌ కె హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్‌, రహదారి, ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - May 26 , 2026 | 10:25 PM