పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:32 PM
వచ్చే ఏడాది జూన్‌లో రానున్న గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని మంచిర్యాల డీసీ పీ ఎగ్గిడి బాస్కర్ అదికారులను ఆదేశించారు.
మంచిర్యాల డీసీపీ ఎగ్గిడి బాస్కర్
లక్షెట్టిపేట, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జూన్‌లో రానున్న గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని మంచిర్యాల డీసీ పీ ఎగ్గిడి బాస్కర్ అదికారులను ఆదేశించారు. గురువారం లక్షెట్టిపేట పట్టణంలో ని గోదావరి వద్ద గల పుష్కరఘాట్‌ను ఆయన మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌తో కలిసి సందర్శించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ గతంలో ఇక్కడ నిర్వహించిన గో దావరి పుష్కరాలకంటే వచ్చే ఏడాది జరుగే పుష్కరాలకు అంతకు మించి ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని అన్నా రు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ప్రస్తు తం ఉన్న ఒక పుష్కరఘాట్ భక్తులకు సరిపోదని మరో ఘాట్ ఏర్పాటు చేసేం దుకు సంభందిత అఽధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీసులు అంతా ఏర్పాట్లను రోజు చూసుకోవాలని ముఖ్యంగా పోలీసుశాఖ ట్రా ఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని రెవెన్యూ తరపున పార్కింగ్ కోసం పది ఎక రాల ప్రభుత్వ స్థలం తహసీల్దార్ మంజూరు చేసారని దాన్ని శుభ్రం చేపించు కో వాలన్నారు. నీరు కూడా ఎక్కువగా ఉండటంతో పుష్కరాల సమయంలో గజ ఈ తగాళ్లను అందుబాటులో ఎక్కువ మేరకు ఉంచాలని, ఆలయాల వద్ద కూడా ఏ ర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి పుణ్యస్నా నాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఈ కా ర్యక్రమంలో తహసీల్దార్ దిలీప్‌కుమార్, సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్, మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్ ఉన్నారు.