Share News

kumaram bheem asifabad- ‘నీట్‌’కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Jun 06 , 2026 | 10:42 PM

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు 21న నిర్వహించనున్న నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (నీట్‌)ను పోలీసు బందో బస్తు మధ్య పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్‌, ఆరోగ్య కార్యదర్శి క్రిష్టియానా, శాంతి భద్రతల డీసీ మహేష్‌ భగవత్‌, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, సెర్ప్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికార దివ్య దేవరాజన్‌లతో కలిసి వీసీ ద్వారా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్‌, తదితరులతో నీట్‌ పరీక్ష నిర్వహణ, యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు, ఈ నెల 9న హైదరాబద్‌లని పరేడ్‌ గ్రౌండ్‌లో స్వయం సహాయక సంఘాలకు బస్సుల పంపిణీ అంశాలపై సమీక్షా సమావేశం న్విహించారు.

kumaram bheem asifabad- ‘నీట్‌’కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ హరిత, ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌

ఆసిఫాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు 21న నిర్వహించనున్న నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (నీట్‌)ను పోలీసు బందో బస్తు మధ్య పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్‌, ఆరోగ్య కార్యదర్శి క్రిష్టియానా, శాంతి భద్రతల డీసీ మహేష్‌ భగవత్‌, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, సెర్ప్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికార దివ్య దేవరాజన్‌లతో కలిసి వీసీ ద్వారా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్‌, తదితరులతో నీట్‌ పరీక్ష నిర్వహణ, యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు, ఈ నెల 9న హైదరాబద్‌లని పరేడ్‌ గ్రౌండ్‌లో స్వయం సహాయక సంఘాలకు బస్సుల పంపిణీ అంశాలపై సమీక్షా సమావేశం న్విహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జూన్‌ 21న దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న నీట్‌ పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. నైరుతి రుతు పవనాలు త్వరలో రాష్ట్రంలో ప్రవేశిస్తున్నందున యాసంగి వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పారు. కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఉన్నందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఈ నెల 9న హైదరాబాద్‌లని పరేడ్‌ మైదానంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు బస్సులు అందజేసే కార్యక్రమం ఉందన్నారు. మహిళలను బస్సులలో జాగ్రత్తగా హైదరాబాద్‌కు తీసుకు రావాలని అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్‌ హరిత, ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌లతో కలిసి హాజరయ్యారు. వీసీ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 21న నిర్వహించే నీట్‌ పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. జన్కాపూర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఈ నెల 9న బస్సుల పంపిణీ కార్యక్రమానికి మండలానికి ఒక బస్సు చొప్పున 15 బస్సులలో స్వయం సహాయ సంఘాల మహిళలను హైదరాబాద్‌ తరలించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, నీట్‌ పరీక్షల ముఖ్య పర్యవేక్షకులు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 10:42 PM