kumaram bheem asifabad- మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Jan 27 , 2026 | 10:49 PM
రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, ఎస్‌పీలు, అదనపు కలెక్టర్‌లు, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, ఎస్‌పీలు, అదనపు కలెక్టర్‌లు, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలలో వసతులు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్డ్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేయాలని అన్నారు. ప్లయింగ్, స్టాటిస్టిక్ సర్వేయలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఎస్పీ వహిదుద్దీన్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నామినేషన్ కేంద్రాలలో, పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలలో భద్రతా చర్యలు, సీసీ కెమెరాల ఏర్పాట్లు చేసి పర్యవేక్షించనున్నామని తెలిపారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ల స్వీకరణపై శిక్షణ, జోనల్ అధికారులు, పీవోలు, ఏపీవోలకు శిక్షణ, ప్లయింగ్, స్టాటిస్టిక్ సర్వేయలెన్స్ బృందాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా టోల్ ఫ్రీ నంబరు 850084 4365 ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా అధికారుల సమన్వయంతో అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు గజానన్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.