Share News

kumaram bheem asifabad- మున్సిపల్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:16 PM

మున్నిపల్‌ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏరాపట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని అన్నారు. హైదరాబాద్‌ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి బుధవారం వీసీ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, సబ్‌ కలెక్టర్‌లు, మున్సిపల్‌ కమిషనర్లతో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితా ప్రకటన, పోలింగ్‌ కేంద్రాల జాబితా ప్రకటన, నామినేషన్‌ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు, పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాలలో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు

kumaram bheem asifabad- మున్సిపల్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌, అదనపు, సబ్‌ కలెక్టర్‌లు

ఆసిఫాబాద్‌, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మున్నిపల్‌ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏరాపట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని అన్నారు. హైదరాబాద్‌ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి బుధవారం వీసీ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, సబ్‌ కలెక్టర్‌లు, మున్సిపల్‌ కమిషనర్లతో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితా ప్రకటన, పోలింగ్‌ కేంద్రాల జాబితా ప్రకటన, నామినేషన్‌ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు, పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాలలో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు లేకుండా పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ చేపట్టాలని తెలిపారు. ఇందులో భాగంగా ఎన్నికల అధికారుల విదులు, కేటాయింపు, పోలింగ్‌ కేంద్రాలు, కౌంటింగ్‌ కేంద్రాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఇతర ప్రతి అంశంపై పర్యవేక్షించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల వీసీ హాల్‌ నుంచి కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో 20 వార్డులు, కాగజ్‌నగరలో 30 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించి అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్‌ పరిధిలో పోలింగ్‌ కేంద్రాల జాబితా, ఫొటో ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్‌ స్వీకరణ కేంద్రం, పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్లు గజానన్‌, రాజేందర్‌, అధికారులు యశ్వంత్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 11:16 PM