Share News

kumaram bheem asifabad- ఓటర్లు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 11 , 2026 | 10:59 PM

రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో గల జన్కాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఆసిఫాబాద్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల, ఉఊమీడియం పాఠశాలలో ఏర్పాటు చేసి పోలింగ్‌ కేంద్రాలను బుధవారం సందర్శించి పోలింగ్‌ సరళిని పశీలించారు

kumaram bheem asifabad- ఓటర్లు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు
ఆసిఫాబాద్‌లో పోలింగ్‌ కేంద్రాలను సందర్శిస్తున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో గల జన్కాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఆసిఫాబాద్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల, ఉఊమీడియం పాఠశాలలో ఏర్పాటు చేసి పోలింగ్‌ కేంద్రాలను బుధవారం సందర్శించి పోలింగ్‌ సరళిని పశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలి టీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలలో కొనసాగుతున్న పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 28 పోలింగ్‌ కేంద్రాలు, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులకు గాను 85 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షించామని తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయడంతో పాటు వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక వీల్‌ చైర్‌లు ఏర్పాటు చేశామని వివరిం చారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా తాగునీరు, నీడ ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యవసర వైద్య సేవలకు ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

కాగజ్‌నగర్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): పోలింగ్‌ కేంద్రాల వద్ద పక్కాగా నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్‌ కె హరిత తెలిపారు. బుధవారం కాగజ్‌నగర్‌లో పలు పోలింగ్‌ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల వద్ద పక్కాగా నిబంధనలు పాటించాలన్నారు. ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్చగా వేసుకునేట్టు చూడాలని సిబ్బందికి సూచించారు. అలాగే వివిధ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా కూడా వెంటనే తమ దృష్టికి తీసుకరావాలన్నారు. అలాగే సమస్యాత్మక కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని సూచించారు. ఈమె వెంట స్థానిక అధికారులున్నారు.

Updated Date - Feb 11 , 2026 | 10:59 PM