Share News

kumaram bheem asifabad- ఇళ్లగణనకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - May 07 , 2026 | 10:34 PM

జిల్లాలో ఇళ్లగణనకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ హరిత అన్నారు. జనగణన- 2027 కార్యక్రమంలో భాగంగా ఇళ్లగణ న కార్యక్రమాన్ని పకడ్బంధీగాఈ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళి కేరి అన్నారు. హైదరాబాద్‌ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, మున్సిపాల్‌ కమిషనర్లు, ముఖ్య ప్రణాళిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- ఇళ్లగణనకు పకడ్బందీ ఏర్పాట్లు
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇళ్లగణనకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ హరిత అన్నారు. జనగణన- 2027 కార్యక్రమంలో భాగంగా ఇళ్లగణ న కార్యక్రమాన్ని పకడ్బంధీగాఈ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళి కేరి అన్నారు. హైదరాబాద్‌ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, మున్సిపాల్‌ కమిషనర్లు, ముఖ్య ప్రణాళిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి జూన్‌ 9 వరకు నిర్వహించే ఇండ్ల గణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. అన్ని స్థాయిలలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ పూర్తి చేయాలని చెప్పారు. 10వ తేదీలోగా ఎన్యూమరేటర్లకు, సూపర్‌వైజర్లకు మెటీరియల్‌ కిట్‌లు, గుర్తింపు కార్డులు అందజేయాలని సూచించారు. స్వీయ గణనపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రజలందరికి తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. ఇళ్లగణన శిక్షణకు బ్యాచ్‌ హాజరు, సీఎంఎంఎస్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన వీసీ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ కె హరిత, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 11 నుంచి జూన్‌ 9వ వరకు నిర్వహించనున్న ఇళ్లగణన ప్రక్రియ కోసం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో 994 మంది ఎన్యూమరేటర్లు, 174 మంది సూపర్‌వైజర్లను నియమించామని వివరించారు. 1,689 ఇళ్ల జాబితా బ్లాక్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇళ్లగణన ప్రక్రియలో విధులు నిర్వహించే వారికి అన్ని స్థాయిలలో శిక్ష పూర్తి చేశామని వివరించారు. స్వీయ గణనను చేసుకునేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నా మని చెప్పారు. ప్రజలందరికీ తెలిసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళికాధికారి వాసుదేవరెడ్డి, ఆయాశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): కుట్టు మిషన్‌ శిక్షణ శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలో గురువారం మహిళా సాధికారత సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్‌ శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కుట్టు మిషన్‌ శిక్షణ ద్వారా మహిళలకు జీవనోపాధి పొందవచ్చన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు వస్త్ర ధారణపై ఎక్కువ చూపుతున్నారని అన్నారు. తదనగుణంగా ఎంబ్రాయిడరీ డిమాండు ఉన్నందున మహిళలు కుట్టు మిషన్‌ శిక్షణ తీసుకోవడం ద్వారా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుందన్నారు. మహిళలకు శిక్షణ అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. శిక్షణ పొందిన మహిళలు నలుగురికి ఉపాధి కల్పించేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కామ్డే అనిల్‌, ఆసిఫాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగతో పాటు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కుసుమ విజయ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2026 | 10:34 PM