వన్యప్రాణుల వేటకు పాల్పడితే కఠిన చర్యలు
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:26 PM
వన్యప్రాణుల వేటకు పాల్పడే వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామని జన్నారం అటవీ డివిజన్ అధికారి ఎఫ్‌డీవో రామ్మోహన్ హెచ్చరించారు.
జన్నారం అటవీ డివిజన్ అధికారి రామ్మోహన్
దండేపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): వన్యప్రాణుల వేటకు పాల్పడే వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామని జన్నారం అటవీ డివిజన్ అధికారి ఎఫ్‌డీవో రామ్మోహన్ హెచ్చరించారు. శనివారం దండేపల్లి మండలం తాళ్లపే ట అటవీ రెంజ్ కార్యలయంలో ఎఫ్‌ఆర్‌వో వికాస్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంట పొలాల చుట్టూ వి ద్యుత్ తీగలు అమర్చడం, ఉచ్చులు వేయడం బల్లెములు, ఇతర ప్రమాదకర పద్ధతులతో వన్యప్రాణులను వేటాడటం చట్టరీత్యా నేరమన్నారు. ఇలాంటి చ ర్యల వల్ల వన్యప్రాణులతో పాటు మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లు తుందన్నారు. వైడ్‌లైప్ ప్రోటెక్షన్ యాక్టివ్ 1972 ప్రకారం తీవ్రమైన నేరాలకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్షచ జరిమాన విధించే అవకాశం ఉం దన్నారు. అలాగేవిద్యుత్ చట్టం 2003 ప్రకారం కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో జన్నారం అటవీ డివిజన్ పరిధి లో ఇలాంటి అక్రమ వేట కార్యకలాపాల వల్ల వన్యప్రాణులు మృత్యువాత ప డటమే కాకుండా విద్యుత్ తీగల కారణంగా మనుషులు కూడా ప్రాణాలు కో ల్పోయిన సంఘటనలు చోటు చేస్తుకున్నాయన్నారు. కార్యక్రమంలో తాళ్లపే ట ఎఫ్‌ఆర్‌వో వికాస్, డీఆర్వోలు సాగరిక, రాము, ఎఫ్‌ఎస్‌వో పాల్గొన్నారు.