Share News

kumaram bheem asifabad- అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - Sep 25 , 2026 | 11:16 PM

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్‌డీఏ పీడీ దత్తారాం అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ పథకం (వీబీ జీరామ్‌జీ) సామాజిక తనిఖీ ప్రజావేధిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎప్రిల్‌ 2025 నుంచి మార్చి 2026 వరకు రూపాయిలు 9.47 కోట్ల నిధులతో వివిధ రకాల పనులు చేపట్టామని తెలిపారు.

kumaram bheem asifabad- అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
వివరాలు తెలుసుకుంటున్న డీఆర్‌డీఏ పీడీ దత్తారాం

సిర్పూర్‌(యు), సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్‌డీఏ పీడీ దత్తారాం అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ పథకం (వీబీ జీరామ్‌జీ) సామాజిక తనిఖీ ప్రజావేధిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎప్రిల్‌ 2025 నుంచి మార్చి 2026 వరకు రూపాయిలు 9.47 కోట్ల నిధులతో వివిధ రకాల పనులు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా దీనికి సంబందించిన సామాజిక తనిఖీ నిర్వహించగా మండలంలోని 15 గ్రామ పంచాయితీలో సిటిజన్‌ చార్ట్‌లు లేకపోవడం, విలేజ్‌ మానిటరింగ్‌ కమిటీలు లేకపోవడం లాంటి పొరపాట్లు జరిగిన్నట్లు తేలిందన్నారు. పలు గ్రామలల్లో పని కంటే ఎక్కువ నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. నర్సరీలలో మొక్కలు పెంచడంలో నిర్లక్షం చేయడంతో 80 నుండి 90 శాతం మొక్కలు ఎండిపోయినట్లు గుర్తించామన్నారు. పలు గ్రామల్లో ఎక్కువ మొక్కలు నాటి వాటికి ట్రాలీల ద్వారా నీరు పోసిన్నట్లు బిల్లు చేశారని వెల్లడైందని తెలిపారు. కార్యక్రమంలో జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడ్మేత విశ్వనాథ్‌రావు, ఎంపీడీవో రవిందర్‌, ఏపీవో కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 11:16 PM