Share News

kumaram bheem asifabad- ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Aug 11 , 2026 | 10:52 PM

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యల తప్పవని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ తెలిపారు. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ర్వహించిన మండల సర్వ సభ్య సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబుతో కలిసి ఆయన హాజరయ్యారు.

kumaram bheem asifabad- ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దండే విఠల్‌

కౌటాల, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యల తప్పవని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ తెలిపారు. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ర్వహించిన మండల సర్వ సభ్య సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నట్టు వివరించారు. ప్రజలు, సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పరిష్కరించేట్టు చూడాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు మాట్లాడుతూ సిర్పూరు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు విడుదలయ్యాయన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు పలు సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. కాగా మండలానికి చెందిన పలువురు నాయకులు కాగజ్‌నగర్‌ భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ కోసం నడిచే బస్సును పునరుద్ధరించాలని మంగళవారం ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ కోసం బస్సు సౌకర్యం ఉండేదన్నారు. రాత్రి వేళ్లల్లో కాగజ్‌నగర్‌ నుంచి కౌటాలకు బస్సు సౌకర్యం లేక పోవడంతో అవస్థలు పడుతున్నట్టు తెలిపారు. త్వరలోనే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2026 | 10:52 PM