Share News

అధిక ధరలకు బియ్యం అమ్మితే కఠిన చర్యలు

ABN , Publish Date - Nov 03 , 2026 | 11:11 PM

అధిక ధరలకు బియ్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మెయిన్‌రోడ్డులో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లోబడి బియ్యం వి క్రయాలు జరిపేందుకు వీలుగా శ్రీనాథ్‌ ట్రేడర్స్‌ వారు నూతనంగా ఏ ర్పాటు చేసిన బియ్యం అమ్మకాల అవుట్‌లెట్‌ను ప్రారంభించారు.

అధిక ధరలకు బియ్యం అమ్మితే కఠిన చర్యలు
బియ్యం అమ్మకాల అవుట్‌లెట్‌ను ప్రారంభింస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : అధిక ధరలకు బియ్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మెయిన్‌రోడ్డులో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లోబడి బియ్యం వి క్రయాలు జరిపేందుకు వీలుగా శ్రీనాథ్‌ ట్రేడర్స్‌ వారు నూతనంగా ఏ ర్పాటు చేసిన బియ్యం అమ్మకాల అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. క లెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన గరిష్ట ధరలకు మించి అ మ్మకాలు జరపకూడదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బీపీటీ, హెచ్‌ఎంటీ తదితర రకాల బియ్యంను ప్రభుత్వం నిర్ధేశిత ధరలకు అందించేందుకు గజానన్‌ ఇండస్ర్టీస్‌ ముం దుకు రావడం అభినందనీయమన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ప్ర స్తుత మార్కెట్‌లో నెలకొని ఉన్న పరిస్థితుల నేపధ్యంలో బియ్యం వ్యా పారులు, ట్రేడర్లు అందరు మానవతా దృక్పదంతో వ్యవహరిస్తూ ప్రజ లకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ నిర్ణీత ధరకే విక్రయించాలన్నారు. ప్రభుత్వ ధరలకు విక్రయాలు జరిగేలా రె వెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులతో ఆకస్మిక తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తనిఖీల కోసం వచ్చే బృందాలకు వ్యాపారులు, ట్రేడర్లు సహకరించాలన్నారు. అనంతరం మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణ పనులను పరి శీలించారు. పనులను వేగవంతంగా చేయాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 11:11 PM