లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:05 PM
జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కే కృష్ణ అన్నారు.
- జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణ
కందనూలు, జూన్ 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కే కృష్ణ అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలజిస్ట్, రేడియా లజిస్ట్, పీడియాట్రిషన్‌లకు లింగ నిర్ధారణ నిషేధ చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, గర్భస్రావ చట్టం, సంకల్ప్ కార్యక్రమం గురించి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ బాలికల సంఖ్య తగ్గితే సమాజంలో అసమతుల్యత ఏ ర్పడి తీవ్రమైన దుష్ప్రభావాలను కలుగుతాయ ని, లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించకూడదని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వ హించిన వారు, ప్రోత్సహించిన వారు, చేయిం చుకున్న వారు, సహకరించిన వారు శిక్షార్హులవు తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ చెన్నయ్య, ప్రోగ్రామ్ అధికా రులు డాక్టర్ రవికుమార్, డాక్టర్ రఫీక్, డిప్యూ టీ డీఎంహెచ్‌వో డాక్టర్ భరత్‌కుమార్‌రెడ్డి, ఉప మాస్ మీడియా అధికారి రాజగోపాలాచారి, ఏపీ డెమియాలజిస్ట్ ప్రవళిక, హెల్త్ ఎడ్యుకేటర్ బాలస్వామి, డీడీఎం నవీన, వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు పాల్గొన్నారు.