Share News

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:29 AM

ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలతో పాటూ క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌ హెచ్చరించారు. మంగళవారం మండల కేం ద్రంలోని 395లో గల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని మండల కేంద్రానికి చెందిన యువకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌ రెవెన్యూ సిబ్బందితో సర్వే నంబరు 395ను పరిశీలించి వివరాలను సేకరించారు.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌

భీమిని, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలతో పాటూ క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌ హెచ్చరించారు. మంగళవారం మండల కేం ద్రంలోని 395లో గల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని మండల కేంద్రానికి చెందిన యువకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌ రెవెన్యూ సిబ్బందితో సర్వే నంబరు 395ను పరిశీలించి వివరాలను సేకరించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తి పై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్‌ సబ్‌ కలె క్టర్‌కు వివరించారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా వాటిలో బోర్డులు పెట్టాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ రహదారిపై ఆనుకోని ఉన్న ని ర్మించిన అక్రమ నిర్మాణాలను పరిశీలించి వాటిపై సమగ్ర నివేదికలను అం దించాలని తహసీల్దార్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ బి కర్ణ దాస్‌, ఆరై కిషన్‌, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 12:29 AM