Share News

Police Commissioner Sajjanar: చైనీస్‌ మాంజాపై ఉక్కుపాదం

ABN , Publish Date - Jan 06 , 2026 | 02:02 AM

ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్ర విపత్తుగా మారిన చైనామాంజాను ఎవరైనా విక్రయించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని నగర పోలీసు...

Police Commissioner Sajjanar: చైనీస్‌ మాంజాపై ఉక్కుపాదం

హైదరాబాద్‌ సిటీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్ర విపత్తుగా మారిన చైనామాంజాను ఎవరైనా విక్రయించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైనా మాంజా విక్రయాలు జరిగితే వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేసి గానీ, హైదరాబాద్‌ పోలీస్‌ వాట్సాప్‌ నెంబర్‌ 9490616555కు గానీ సమాచారం అందించాలని కోరారు.

Updated Date - Jan 06 , 2026 | 02:02 AM