Share News

వీధి కుక్కల దాడిలో మహిళ మృతి

ABN , Publish Date - May 26 , 2026 | 05:21 AM

మేకపిల్లకు మేత తెచ్చేందుకు వెళ్లిన ఓ మహిళపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.

వీధి కుక్కల దాడిలో మహిళ మృతి

  • కొత్తగూడెం జిల్లాలో ఘటన

లక్ష్మీదేవిపల్లి, మే 25 (ఆంధ్రజ్యోతి): మేకపిల్లకు మేత తెచ్చేందుకు వెళ్లిన ఓ మహిళపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో సోమవారం జరిగింది. చాతకొండ ఎస్సీకాలనీకి చెందిన రాములమ్మ(40) భర్త ఏడాది క్రితం మృతి చెందాడు. కుమారుల వద్దే ఉంటున్న రాములమ్మ తాను పెంచుకుంటున్న మేకపిల్లకు మేత తెచ్చేందుకు తన ఇంటి సమీపంలో ఉన్న బీడుభూమిలోకి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న నాలుగైదు వీధి కుక్కలు ఆమెపై దాడి చేశాయి. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి చనిపోయింది.

Updated Date - May 26 , 2026 | 05:21 AM