Share News

kumaram bheem asifabad- రోడ్లపై పశువులు.. వాహనదారుల తిప్పలు

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:18 PM

పశువులను రోడ్లపై యథేచ్ఛగా వదిలివేస్తుం డడం తో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పశువులు యజమానులు వాటిని పట్టించుకోక పోవడంతో రాత్రివేళల్లో సైతం రోడ్లపైనే సేదతీరుతున్నాయి. దీంతో రాత్రి వేళల్లో ప్రయాణం సాగించే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారి, సర్వీస్‌ రోడ్లుపై పశులువు యఽథేచ్ఛగా తిరుగుతున్నాయి.

kumaram bheem asifabad- రోడ్లపై పశువులు.. వాహనదారుల తిప్పలు
జాతీయ రహదారిపై తిష్ఠ వేసిన పశువులు

- ప్రమాదాలు జరుగుతున్నా పట్టింపు కరువు

వాంకిడి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): పశువులను రోడ్లపై యథేచ్ఛగా వదిలివేస్తుం డడం తో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పశువులు యజమానులు వాటిని పట్టించుకోక పోవడంతో రాత్రివేళల్లో సైతం రోడ్లపైనే సేదతీరుతున్నాయి. దీంతో రాత్రి వేళల్లో ప్రయాణం సాగించే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారి, సర్వీస్‌ రోడ్లుపై పశులువు యఽథేచ్ఛగా తిరుగుతున్నాయి. జాతీయ రహదారిపైనే కాకుండా సర్వీస్‌ రోడ్డు, కాలనీల్లోని అంతర్గత రోడ్లపైనా ఇష్టారీతిన సంచరిస్తుండడం వల్ల ప్రజలకు ప్రాణంకటంగా మారుతోంది. ద్విచక్రవాహనదారులు వాటిని తప్పించే ప్రయత్నంలో ప్రమాదాల బారిన పడి ఆసుత్రుల పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో రహదారిపై పశువులు పోట్లాడుకుంటూ పక్క నుంచి వెళ్లే వాహదారులపై పడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇటీవల చోటు చేసుకున్న..

ఇటీవల మండల కేంద్రంలోని సరండి చౌరస్తా సమీపంలో ద్విచక్రవాహనదారుడు పశువులను తప్పించేయత్నం చేస్తుండగా మరో ద్విచక్రవా హనాన్ని ఢీకొట్డాడు. దీంతో ఆ రెండు ద్విచక్రవాహనాలు ప్రమాదానికి గురై వాటిపై ఉన్న వారికి గాయాలయ్యాయి. మండల కేంద్రానికి చెందిన ఒక రైతు తన భార్యతో వ్యవసాయ పనులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా రహదారిపై రెండు పశువులు పోట్లాడుకుం టు వచ్చి తాకాయి దీంతో భార్య భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పశువులు రోడ్డుపై సంచరిస్తండడంవల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై వదిలివేసిన పశువులకు ప్రమాదవశాత్తు ఏదైన వాహనం తగిలితే తక్షణమే ఈ పశువు తనదని నష్టపరిహారం ఇవ్వాలని రోడ్డుపై సంరక్షకులు ఆందోళనకు దిగుతున్నారని చెబుతున్నారు. కానీ ప్రతి రోజు రోడ్డుపై పశువులను వదిలివేయడం ఎంతవరకు సమంజ సమని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డుపై ఉన్న పశువులను బంజరుదొడ్లో వేసేలా చూడాలని, పశువులను రోడ్లపై వదలివేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

పశువుల సంచారంతో అవస్థలు..

- దుర్గం శ్యాంరావు, అంబేద్కర్‌ యుజన సంఘం ఉపాఽధ్యక్షుడు

నిత్యం పశువులు రోడ్డుపై సంచరిస్తుండడంతో వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. రోడ్డు మద్యలో పశువులు ఉండడంవల్ల వాటిని తప్పించబోయే క్రమంలో ప్రమాదాలు జరిగి వాహనాదారులు గాయపడుతున్నారు. రోడ్లపై పశువులు సంచరిస్తున్నా పంచాయతీ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. పశువులను రోడ్డుపై వదిలి వేస్తున్న యజమానులకు జరిమానాలు విధించడం ద్వారా కట్టడి చేసే అవకాశం ఉంది.

Updated Date - Jul 16 , 2026 | 11:18 PM