kumaram bheem asifabad- కళ్లపై భారం.. భవిత అంధకారం
ABN , Publish Date - Sep 22 , 2026 | 10:38 PM
లోకజ్ఞానం కూడా తెలియని చిన్నారులు పలువురు వివిధ కారణాలతో చూపు మందగించి ఇబ్బందులు పడుతున్నారు. పిన్న వయసులోనే కళ్లద్దాలు దరించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నా యి. ఈనెల 15 నుంచి అర్‌బీఎస్‌కే(రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం) వైద్య బృందాలు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంటి స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెలుగు చూి సంది.
- మొదటి దశలో 22,130 మందికి పరీక్షలు
- 732 విద్యార్థులకు కంటి సమస్యల ఉన్నట్లు గుర్తింపు
- ఈనెల 15 నుంచి మొదలైన రెండో దశ ప్రక్రియ
- స్మార్ట్‌ఫోన్లు, టీవీ స్ర్కీన్‌తో కంటిచూపుపై ప్రభావం
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): లోకజ్ఞానం కూడా తెలియని చిన్నారులు పలువురు వివిధ కారణాలతో చూపు మందగించి ఇబ్బందులు పడుతున్నారు. పిన్న వయసులోనే కళ్లద్దాలు దరించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నా యి. ఈనెల 15 నుంచి అర్‌బీఎస్‌కే(రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం) వైద్య బృందాలు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంటి స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెలుగు చూి సంది. దృష్టిలోపాలకు గురైన వారికి అవసరమైన చికిత్స అందించడంతో పాటు అద్దాలు అవసరమైన వారిని గుర్తిస్తున్నారు.
- గతేడాది..
జిల్లాలో గతేడాది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని రెండు నియోజక వర్గా ల్లోని 135 పాఠశాలల్లో మొత్తం 22,130 మంది విద్యార్థులకు దృష్టి పరీక్షలు నిర్వహించగా వారిలో 9726 మంది బాలురు, 12,404 మంది బాలికలు ఉన్నారు. వీరిలో మొత్తం 732 మంది విద్యార్థులకు దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించగా గత సంవత్సరం 427 మందికి కంటి అద్దాలు అందించగా ప్రస్తుత సంవత్సరం మిగతా 305 మందికి అద్దాల పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈనెల 15 నుంచి రెండో విడత పరీక్షలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆర్‌బీఎస్‌కే డాక్టర్ నరేందర్ పర్యవేక్షణలో కంటి స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదే శాలతో కంటిచూపు లోపం లేని జిల్లా దిశగా చర్యలు తీసుకోవడంలో బాగంగా పరీక్షలు నిర్వహి స్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. గత సంవత్సరం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించి కంటిచూపు లోపం ఉన్నవారిని అధికారులు గుర్తించారు. వారిలో కొంతమందికి కంటి చుక్కలతో నయం కాగా, మరికొంత మందికి ఉచిత అద్దాలను అంద జేశారు. కంటిచూపు లోపం తీవ్రత ఎక్కువగా ఉం టే అపరేషన్ దిశగా కూడా చర్యలు తీసుకో నున్నారు.
ఇవి కారణాలు..
పల్లె, పట్టణాలు తేడా లేకుండా దాదాపు ప్రతి ఇంట్లో కనీసం రెండు, మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. పిల్లలు మారం చేస్తున్నారనో ఇంటి పనులు చక్కదిద్దుకునేటప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఉండాలనో పెద్దలే వారికి ఫోన్లు ఇచ్చి అలవాటు చేస్తున్నారు. ఇక 10 నుంచి 16 ఏళ్ల బాలబాలికలలో కొందరు వ్యక్తిగతంగా ఫోన్లు వాడుతుంటే కొందరు తల్లిదండ్రుల ఫోన్లు వాడుతున్నారు. శారీరక శ్రమ కలిగించే ఆటలకు పిల్లలు దూరంగా ఉండి ఇంట్లో టీవీలకు గంటల తరబడి అతుక్కుపోవడం కూడా కారణంగా మారుతోంది. పిల్లలు అదే పనిగా చిన్న తెరపై గుడ్లప్పగించి చూస్తుండటంతో వారి కంటి చుపుపై ప్రభావం పడుతోంది. ఇక కొందరు పిల్లల్లో పుట్టుకతోనే దృష్టి సమస్య ఉండటం వారు అదే పనిగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు, టీవీలు చూడడంతో సమస్య మరింతగా పెరిగి మెల్లకన్ను వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
మెదడుపై తీవ్ర ప్రభావం..
-డాక్టర్ నాగేంద్ర, డీఎంహెచ్‌వో
చిన్న వయసులో కంటిచూపు సమస్య వస్తే మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పిల్లలు స్మార్ట్‌ఫోన్ లేదా టీవీలు ఎక్కు వగా చూస్తున్నారు. పెద్ద టీవీలను తక్కువ లైటిం గ్‌లో అస్సలు చూడకూడదు. ప్రధానంగా చీకటిలో దుప్పటి కప్పుకొని ఫోన్ చూస్తే దాని ప్రభావం రెండింతలు ఉంటుంది. వీటికి దూరంగా ఉండేలా చూసుకోవాలి.