గాలివాన బీభత్సం
ABN , Publish Date - May 03 , 2026 | 11:00 PM
మంద మర్రి మండలంలో ఆదివారం గాలివాన బీభత్సం సృ ష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో రాళ్ల వర్షం కురిసింది. దీంతో పోలీసుస్టేసన్ బోర్డు ఎ గిరి పోయింది.
రోడ్లపై నేలకూలిన చెట్లు
విరిగిపడిన విద్యుత్ స్తంభాలు
మందమర్రిటౌన్, ఏప్రిల్3 (ఆంధ్రజ్యోతి): మంద మర్రి మండలంలో ఆదివారం గాలివాన బీభత్సం సృ ష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో రాళ్ల వర్షం కురిసింది. దీంతో పోలీసుస్టేసన్ బోర్డు ఎ గిరి పోయింది. పోస్టాఫీసు వద్ద కోల్‌బెల్ట్ రోడ్డుకు ఆ నుకొని ఉన్న గ్యాస్ గోదాం ఎదురుగా చెట్టు కుప్ప కూ లింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్లు విద్యుత్ తీగల స్తంభాలపై పడడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. సింగరేణి రెస్క్యూ సి బ్బంది రోడ్లపై పడిన చెట్లను కట్టర్ల ద్వారా కట్ చేసి తొలగించారు. మామిడి కాయలు గాలి వానకు రాల డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మందమర్రి పట్టణంలోని కార్మిక కాలనీల్లో నాలుగు విద్యుత్ స్తంభాలు కింద పడడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కాలనీలతో పాటు రోడ్లపై చెట్లు నేలకొరిగి పడ్డాయి. స్థానిక జీఎం రాధాకృష్ణ విద్యుత్ పునరుద్దరణ పనులను, చెట్ల తొలగింపు పనులను దగ్గరుండి చేయిస్తున్నారు. విద్యుత్‌ను రాత్రి వరకు పునరుద్దరించాలని పనులను వేగంగా చేస్తున్నారు. మందమర్రి నుంచి గోదావరిఖని రోడ్డుపై చెట్లు పడడంతో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి.
తెగిపడిన కరెంటు వైర్లు.. వరిపంట దిగ్ధం
జైపూర్ : మండలంలోని కాన్కూర్ గ్రామానికి చెం దిన రైతు దుర్గయ్యకు చెందిన వరి పంట ప్రమాద వశాత్తూ పూర్తిగా దగ్ధమైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతు తీవ్రంగా నష్ట పోయాడు. ఫైరింజన్ వచ్చేలోపే పంట పూర్తిగా దగ్ధ మైంది. సంబంధిత అధికారులు వెంటనే నష్టాన్ని అం చనా వేసి పంట నష్టపరిహారం అందించాలని బాధిత రైతు కోరాడు.
మందమర్రిరూరల్ : మండలంలో ఆదివారం సా యంత్రం అకాల వర్షం కురిసింది. గాలులతో కూడిన వర్షం పడడంతో చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభాలు వి రిగి పడ్డాయి. పొన్నారంలో చెట్టు విరిగి రహదారికి అ డ్డంగా పడడంతో సర్పంచు మధు స్పందించి చెట్టు ను సిబ్బందితో తొలగించారు. సారంగపల్లిలో కరెంటు స్తంభాలు విరిగి పడ్డాయి. పలు గ్రామాల్లో ధాన్యం తడిసిపోయింది.
భీమారం : భీమారం మండల కేంద్రంతో పాటు ప లు గ్రామాల్లో శనివారం రాత్రి, ఆదివారం మధ్యా హ్నం కురిసిన ఈదురుగాలుల వర్షంతో అన్నదాతలు ఆగమమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకు న్న ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు పడరాని పా ట్లు పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు ఉంచకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో నాగులమ్మ దేవాలయం సమీపం లో రైతులు పది రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టుకోగా వడ్లు పూర్తిగా మ్యాచర్ వచ్చే విధంగా ఉన్నా నిర్వహకులు వరిధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోటపల్లి : మండల కేంద్రంతో పాటు చుట్టు పక్క ల గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈ దురుగాలులతో కూడిన వర్షం పడింది. ఓ వైపు తీవ్ర మైన ఉష్ణోగ్రతలు ఉన్న నేపధ్యంలో ఒక్కసారిగా ఈ దురుగాలులు వీయడంతో పాటు సుమారు 20 నిమి షాల పాటు వర్షం కురిసింది. దీంతో రైతులు ఆర బోసుకున్న ధాన్యం తడిసి ముద్ద అయ్యింది. ధాన్యం కుప్పలపై కవర్లు కప్పి ధాన్యం తడవకుండా జాగ్రత్త పడ్డారు.