బాల్య వివాహాలతో బతుకు ఆగం
ABN , Publish Date - May 26 , 2026 | 11:19 PM
బాల్య వివాహాలతో బాలికల బతుకులు ఆగం అవుతాయని నాగర్‌కర్నూల్ మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర అన్నారు.
- నాగర్‌కర్నూల్ మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర
నాగర్‌కర్నూల్ టౌన్, మే 26 (ఆంధ్రజ్యోతి) : బాల్య వివాహాలతో బాలికల బతుకులు ఆగం అవుతాయని నాగర్‌కర్నూల్ మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మునిసిపల్ కార్యాల యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99రోజులు కార్యక్రమం లో భాగంగా మహిళా వారోత్సవాల సందర్భంగా మిషన్ వాత్సల్య జిల్లా బాలల పరిరక్షణ విభా గం ఆధ్వర్యంలో అవగాహన పోస్టర్లను ఆవిష్క రించారు. ఆయన మాట్లాడుతూ బాల్య వివాహా లను జరిపించినా, ప్రోత్సహించినా చట్టరీత్యా నేరమన్నారు. ప్రతీ ఒక్కరు బాల వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కలిగి ఉండి బాలి కల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ నాగిరెడ్డి, జిల్లా సంక్షేమ సమితి సభ్యులు జంగి టి విష్ణు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి శ్రీశై లంగౌడ్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ శోభారాణి, చైల్డ్ హెల్ప్‌లైన్ సభ్యుడు రమేష్ పాల్గొన్నారు.
ఫ కొల్లాపూర్, (ఆంధ్ర జ్యోతి) : మండలంలోని ఎల్లూరు గ్రామ పంచా యతీలో సర్పంచ్ శశికళ ఆధ్వర్యంలో మంగళవా రం బాల్యవివాహా వల్ల క లిగే అనర్థాలపై అవగాహ న సదస్సు నిర్వహించారు. ఎవరైనా బాల్యవివాహం చేస్తే చైల్డ్ వెల్ఫేర్ హెల్ప్ లైన్‌నెంబర్ 1098 ఫోన్ చేయాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతారన్నారు. చైల్డ్ వెల్ఫేర్ సూపర్‌వైజర్ కవిత, ఉప సర్పంచ్ నక్క నిరం జన్ యాదవ్, అంగన్‌వాడీ సూపర్ వైజర్ సబిత, అంగన్‌వాడీ టీచర్స్ కౌసల్య, లోకేశ్వరి, గిరివాణి, ఆశా వర్కర్ గౌరమ్మ, ప్రమీల, ఉమ లక్ష్మి, గ్రామ స్థులు పాల్గొన్నారు.
ఫ అచ్చంపేటటౌన్, (ఆంధ్రజ్యోతి) : బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని ఐసీ డీఎస్ సీడీపీవో లక్ష్మీ అన్నారు. మంగళవారం పట్టణంలోని బాల్యవివాహాల నిర్మూలపై అవగా హన ర్యాలీ నిర్వహించారు. అంగన్‌వాడీ సిబ్బం ది పాల్గొన్నారు.
ఫ కల్వకుర్తి, (ఆంధ్రజ్యోతి) : బాల్య వివాహా లను అరికడదామని సీడీపీవో భాగ్యమ్మ అన్నా రు. కల్వకుర్తి పట్టణంలోని సుభాష్‌నగర్ అంగన్ వాడీ కేంద్రంలో మంగళవారం బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. కార్యక్రమంలో డీసీపీవో మధుబాబు, మల్లేష్, అంగన్‌వాడీ టీచరు అలివేల, పలువురు తల్లులు, మహిళలు, బాలికలు పాల్గొన్నారు.
ఫ ఉప్పునుంతల, (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ప్రజలకు బాల్య వివాహాలపై అంగన్‌వాడీ సూపర్‌వైజర్ బీపాషా అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పావనితో పాటు ఆయా అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.