Share News

kumaram bheem asifabad- ఏసీబీ దాడుల కలకలం

ABN , Publish Date - Oct 29 , 2026 | 10:56 PM

కాగజ్‌నగర్‌ మండలంలోని మోసం గ్రామానికి చెందిన జీపీవో (గ్రామ పాలన అధికారి) శ్రీనివాస్‌ గురువారం రూ.22వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడడంతో కలకలం చోటు చేసుకున్నది. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ డీఎస్పీ ఏసీబీ మధు మాట్లాడారు. కాగజ్‌నగర్‌ మండలం మోసంకు చెందిన ఓ రైతు తన తాత పేరిట ఉన్న 22 ఎకరాల భూమిని వారసత్వంగా తన పేరుపై బదిలీ చేయాలని జీపీవో శ్రీనివాస్‌ను కోరాడని చెప్పారు. దీంతో శ్రీనివాస్‌ రూ.50వేలు డిమాండ్‌ చేశాడని , రూ.22వేలకు ఒప్పందం కుదిరిందని వివరించారు.

kumaram bheem asifabad- ఏసీబీ దాడుల కలకలం
వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ మధు

కాగజ్‌నగర్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మండలంలోని మోసం గ్రామానికి చెందిన జీపీవో (గ్రామ పాలన అధికారి) శ్రీనివాస్‌ గురువారం రూ.22వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడడంతో కలకలం చోటు చేసుకున్నది. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ డీఎస్పీ ఏసీబీ మధు మాట్లాడారు. కాగజ్‌నగర్‌ మండలం మోసంకు చెందిన ఓ రైతు తన తాత పేరిట ఉన్న 22 ఎకరాల భూమిని వారసత్వంగా తన పేరుపై బదిలీ చేయాలని జీపీవో శ్రీనివాస్‌ను కోరాడని చెప్పారు. దీంతో శ్రీనివాస్‌ రూ.50వేలు డిమాండ్‌ చేశాడని , రూ.22వేలకు ఒప్పందం కుదిరిందని వివరించారు. దీనిపై రైతు కుటుంబీకులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారని తెలిపారు. గురువారం రైతు ద్వారా కాగజ్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోనే డబ్బులు అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. డబ్బులు అందిస్తున్న సమయంలో జీపీవోను పట్టుకొని కేసు నమోదు చేశామని చెప్పారు. సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపినట్టు తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచాలు డిమాండు చేస్తే 106కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. కాగా ఈ కార్యాలయంలో అధికారుల పని తీరుపై పలువురు నాయకులు నేరుగా గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా కూడా అధికారుల్లో ఎలాంటి మార్పు రాక పోవడంతోనే బాధితులు నేరుగా ఎసీబీ అధికారులను ఆశ్రయించాల్సి పరిస్థితి వచ్చిందన్నది చర్చనీయాంశగా మారుతోంది. కొన్ని రోజులు క్రితం ప్రధానంగా బీజేజీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం సీఎం రేవంత్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కాగజ్‌నగర్‌ కోసిని సర్వేనెంబరు 79. 80ప్రభుత్వ భూమిలో ప్లాట్లు చేసి విక్రయించారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇక్కడి అధికారులు నామ మాత్రపు సర్వేలు చేసి వదిలేశారు. కాగజ్‌నగర్‌లో ఇప్పటి వరకు ఏసీబీ దాడులు చేసిన వివరాలను పరిశీలిస్తే 2025 జూలై 18న కాగజ్‌నగర్‌ ఇన్‌చార్జి లేబర్‌ అధికారి రాంమోహన్‌ఉ ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో కూడా రూ.50వేలు బాధితుడి నుంచి డిమాండ్‌ చేశారు. అలాగే సబ్‌ ట్రేజరి అధికారి రమణాచారి చారి కూడా రూ.20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

Updated Date - Oct 29 , 2026 | 10:56 PM