ఇంకా వెరిఫై చేయాలి
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:37 PM
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు, విచా రణలు, డీఈవో స్థాయి పరిశీలన, పరిష్కార ప్ర క్రియకు సంబంధించిన నేటి వరకు నమోదైన వివరాలను కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధు లకు వెల్లడించారు.
- ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
- రాజకీయ పార్టీల ప్రతినిఽఽధుల సమావేశంలో వివరాల వెల్ల్లడి
నాగర్‌కర్నూల్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు, విచా రణలు, డీఈవో స్థాయి పరిశీలన, పరిష్కార ప్ర క్రియకు సంబంధించిన నేటి వరకు నమోదైన వివరాలను కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధు లకు వెల్లడించారు. బుధవారం కలెక్టర్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిఽధులతో ఎస్‌ఐ ఆర్ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1,15,824 నోటీసులు రూపొందించి అదే సంఖ్యలో నోటీసులు పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 1,15,494 విచారణలు నిర్వహించగా 323 కేసు ల్లో విచారణ గడువు ముగిసిందని, 7 కేసు లకు రీషెడ్యూల్ గడువు ముగిసిందని కలెక్టర్ తెలి పారు. డీఈవో స్థాయిలో మొత్తం 1036 కేసు లు పెండింగ్‌లో ఉండగా 123 కేసులు 5 రోజు లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని, 6904 కేసు లు వెరిఫై చేయబడి 5 కేసులు ఇంకా వెరిఫై చేయాల్సి ఉన్నాయని కలెక్టర్ వివరించారు. నాగ ర్‌కర్నూల్ నియోజకవర్గంలో 43,569, అచ్చం పేటలో 39,594, కొల్లాపూర్‌లో 32,687 నో టీసు లు జారీ చేయాల్సినవిగా నమోదయ్యాయని, ఆయాని యోజకవర్గాల్లో ఎస్‌ఐ ఆర్ ప్రక్రియ పురోగతిని సమీ క్షించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఎ న్నికల విభాగం సూపరింటెం డెంట్ రవికుమార్, ఎన్నికల డీటీ కల్పన, గుర్తిం పు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిఽధులు ఎండీ హబీబ్, ఎండీ హుస్సేన్, బాలకృష్ణ, హరి, రామకృష్ణ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ బుధ వారం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ల ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో కలిసి ఈవీఎం గోదామున పరిశీలించారు. గోదాం సీల్ ను పరిశీలించి అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకులతోపాటు వివిఽధపార్టీల ప్రతినిధులు ఉన్నారు.
గొర్రెల పెంపకం యూనిట్ల పరిశీలన
జిల్లా కేంద్రానికి సమీపంలో నాగర్‌కర్నూల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన గొర్రెల పెంపకం యూ నిట్, పెట్రోల్ బంక్‌ను, వేరుశనగ గానుగ నూనె ఉత్పత్తి కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. గొర్రెల పెంపకం యూనిట్‌లోని గొర్రెల ఆరోగ్య పరిస్థితి, వయస్సు, ఆరోగ్య పరిస్థితి, పెంపకం విధానం, దాణా, సం రక్షణ చర్యలపై అధికారులను కలెక్టర్ వివరాల ను అడిగి తెలుసుకున్నారు. దాణా పశువైద్యాధి కారుల సమన్వయంతో అవసరమైన టీకాలను నిర్ణీత సమయంలో అందుబాటులో ఉంచుకోవా లని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అధికా రులు పాల్గొన్నారు.
డికార్డికేటర్ యంత్రం ఉపయోగకరం
ఉప్పునుంతల, (ఆంధ్రజ్యోతి) : వేరుశనగ పంటసాగు చేసే రైతులకు డికార్డికేటర్ యం త్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. అ చ్చంపేట నియోజకవర్గంలోని మండల కేంద్రం లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేరుశనగ గింజల నుంచి పొట్టు తొలగించే డికార్డికేటర్ యత్రం ద్వారా నిర్వహిస్తున్న ప్రక్రియను బుధవారం అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ యంత్రం పనితీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడు తూ యంత్రం ఏర్పాటు చేసిన ఉద్దేశం, దాని పనితీరు, సామర్థ్యం, ఒకేసారి ఎంత పరిమాణం లో వేరుశనగను శుభ్రపరిచి గింజలను వేరు చేయగలదో తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించిన అధికారు లు, సిబ్బంది పాల్గొన్నారు.