Share News

kumaram bheem asifabad- సోలార్‌ విద్యుత్‌ వైపు అడుగులు

ABN , Publish Date - Aug 23 , 2026 | 10:17 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ మేరకు కుమరం భీం జిల్లాలో ప్రభుత్వ విద్యుత్‌ ఉత్పత్తి స్వయంగా పెంచుకోవడంతో పాటు భవిష్యత్తు విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు సోలార్‌ పవర్‌ను విస్తృతంగా ఉత్పత్తి చేయాలని అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది.

kumaram bheem asifabad- సోలార్‌ విద్యుత్‌ వైపు అడుగులు
లోగో

- ఇప్పటికే మూడు ప్రభుత్వ శాఖలకు కీలక బాధ్యతలు

తిర్యాణి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ మేరకు కుమరం భీం జిల్లాలో ప్రభుత్వ విద్యుత్‌ ఉత్పత్తి స్వయంగా పెంచుకోవడంతో పాటు భవిష్యత్తు విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు సోలార్‌ పవర్‌ను విస్తృతంగా ఉత్పత్తి చేయాలని అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా సోలార్‌ పవర్‌ను అందుబాటులోకి తీర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతీ మండల కేంద్రంలో ఉన్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు సమీపంలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

- కనీసం ఐదు ఎకరాల్లో..

కనీసం ఐదు ఎకరాల్లో ఒక్కొ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకే మండలంలో ఒకటి కన్నా ఎక్కువ విద్యుత్‌ సబ్‌ స్టేషనలు ఉంటే అక్కడి అవసరాలను బట్టి అదనంగా మరో విద్యుత్‌ సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలని నూతన ప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లు ఉంటే అక్కడి అవసరాలను బట్టి అదనంగా మరో విద్యుత్‌ సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలని నూతన ప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు సమీపంలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని తొలుత గుర్తించనున్నారు. ఒకవేళ అందుబాటులో లేక పోతే కొంచం దూరంలోనైనా వ్యవసాయ అవసరాలకు పనికి రాకుండా రాళ్లు ఉన్న భూమిని కూడా గుర్తించనున్నారు.

- సబ్సిడీని వినియోగించి..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీని వినియోగించి మండల కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు ఈ సారి ప్లాటు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న సోలార్‌ ప్లాంట్లకు సంబంధించిన ప్రభుత్వ స్థలాలతో పాటు వినియోగంలో లేని భూములను గుర్తించేందుకు మూడు ప్రభుత్వ శాఖలకు బాధ్యతల అప్పగించారు. రెవెన్యూ విద్యుత్‌, పంచాయతీరాజ్‌ శాఖల అధికారుల సమన్వయం చేసుకొని భూములను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. సౌర శక్తి వినియోగం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ప్రోత్సాహకాలు ఇస్తుండడంతో పాటు ప్లాంటు ఏర్పాటు అనంతరం సబ్సిడీ కూడా పెద్ద మొత్తంలో అందజేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి మండల కేంద్రంలో ఈ సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అధికారులుచర్యలు తీసుకుంటున్నారు. వాస్తవంగా ప్రధాన మంత్రి సూర్య ఘర్‌ స్కీం కింద గృహ అవసరాల కోసం ఉపయోగపడేందుకు పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో ప్రధానంగా ఒక కిలో వాట్‌ ఇస్తున్న సబ్సిడి రూ.30వేలు, రెండు కిలో వాట్‌ రూ.60, మూడు కిలో వాట్‌కు రూ.78వేలు సబ్సిడీ ఇస్తోంది. ఆసక్తి ఉన్న వారికి కూడా బ్యాంకు నుంచి రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. గృహ అవసరాలకు వాడుకునేందుకు చాలా అవకాశం ఉండడం విశేషం. ఈ స్కీంలో ఇంటి పైకప్పు పైన ఏర్పాటు చేసుందుకు వీలు ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటే రుణం మంజూరు కాగానే సబ్సిడీ నేరుగా దరఖాస్తుదారుడికి అందే వీలు ఉంటుంది. ప్రతి నెలా సోలార్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటు నేరుగా గ్రిడ్‌కు పోనుంది. ట్రాన్స్‌కో వచ్చే కరెంటు బిల్లు కట్‌ చేసి మిగితా బిల్లును ప్రతీ రెండు నెలలకొకమారు దరఖాస్తుదారుడి అకౌంటులో జమ కానుండడంతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Updated Date - Aug 23 , 2026 | 10:17 PM