kumaram bheem asifabad- తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:01 PM
జిల్లాలో వేసవిలో తాగునీటికి ఇబ్బందు లు లేకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా ఎంపీడీవోలు, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేసవిలో తాగునీటికి ఇబ్బందు లు లేకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా ఎంపీడీవోలు, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో చేతి పంపులు, బోర్‌వెళ్లు చెడిపోతే మరమ్మతులు చేయాలన్నారు. పైపు లైన్ మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. మారు మూల గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందని సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించాలని అన్నారు. గ్రామాలలో చేతి పంపులు ఎండిపోతే ప్రత్యామ్నాయంగా వ్యవసాయ బావులు, వ్యవసాయ పంపు సెట్లను గుర్తించి యజమానులతో సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. తాగునీటికి ఇబ్బందులు ఉన్న గ్రామాల్లో పంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీటిని సరఫరా చేసి వాటి వివరాలను లాక్ బుక్‌లో నమోదు నమోదు చేయాలని చెప్పారు. తాగునీటి సమస్య ఏర్పడితే వెంటనే మిషన్ భగీరథ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో పంచాయతీ కార్యదర్శలు సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో వీధి దీపాలు పగలు పూట కూడా వెలుగుతున్నాయని వెంటనే ఆన్‌ఆఫ్ స్వీచ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్‌కార్యక్రమంను వంద శాతం పూర్తి అయ్యేలా పంచాయతీ కార్యదర్శులు బీఎల్‌వోలకు సహకరించాలని తెలిపారు. జనాభా గణనలో భాగంగా స్వీయ గణన ప్రక్రియపై గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. స్వీయ గణన చేసుకునేలా ప్రజలకు అవగాహన పర్చాలన్నారు. ఉపాధి హామీ పని ప్రదేశాలలో తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా కార్యదర్శులు పర్యవేక్షించాలని సూచించారు. వ్యవసాయ శాఖ చేపడుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియలో రైతులు తమ వివరాలను నమోదు చేసుకునేలా వ్యవసాయాధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, ఈఈ రాకేష్, డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
15ఏఎస్‌ఎఫ్28:
14ఏఎస్‌ఎఫ్‌పి28: విద్యార్థులను అభినందిస్తున్న కలెక్టర్ కె హరిత
విద్యార్థులకు అభినందించిన కలెక్టర్
ఆసిఫాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయి జూనియర్ షూటింగ్ బాల్ పోటీల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తుమ ప్రతిభకనబర్చడంతో మంగళవారం జిల్లా కలెక్టర్ కెహరిత వారిని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి జూనియర్ షూటింగ్ బాల్ పోటీలలో జిల్లాలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 25 నుంచి 27 వరకు భువనగిరి జిల్లా మొతుకుర్ మండలంలో జరిగిన రాష్ట్ర స్థాఇ పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో కాంస్య పతకం సాధించడం అభినందనీయమనారు. ఈ కార్యక్రమంలో షూటింగ్ బాల్ రాష్ట్ర ప్రతినిధులు సైనీ రవికుమార్, సోమశేఖర్, హరిచరణ్, డీఎస్‌ఓ షేక్, పూట్‌బాల్ కోచ్ రవి, ఖేలో ఇండియా కోచ్ రాకేష్, పీడీ లక్ష్మిలు పాల్గొన్నారు.