kumaram bheem asifabad-మౌలిక వసతుల కల్పనకు చర్యలు
ABN , Publish Date - Feb 19 , 2026 | 10:58 PM
జిల్లాలో ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమాల్లో భాగంగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె హరిత అన్నారు. న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం నుంచి వర్చువల్ ద్వారా గేట్స్ ఫౌండేషన్ సీఈవో బిల్ గేట్స్, ఇతర కార్యదర్శులతో కలిసి నీతి తారా పథకాన్ని వర్చువల్ విధానంలో గురువారం నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం ప్రారంభించారు.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమాల్లో భాగంగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె హరిత అన్నారు. న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం నుంచి వర్చువల్ ద్వారా గేట్స్ ఫౌండేషన్ సీఈవో బిల్ గేట్స్, ఇతర కార్యదర్శులతో కలిసి నీతి తారా పథకాన్ని వర్చువల్ విధానంలో గురువారం నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో మాట్లాడుతూ దేశంలోని 340 పైగా జిల్లాలోని ఆకాంక్షిత జిల్లాలు, బ్లాక్‌లో నీతి ఆయోగ్ ద్వారా సంపూర్ణత అభియాన్ కింద విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం, మహిళలకు రివాల్వింగ్ పండ్ వంటి వాటిని చేపడుతామని తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతులు, బాలికలకు ప్రత్యేక మూత్రశాలల నిర్మాణం, అంగన్‌వాడీలలో వసతుల కల్పన, పౌష్టికాహారం, శామ్ మామ్ కార్యక్రమాలు నిర్వహణ, గ్రామీణ ప్రాంతాల్లో హైపర్ టెన్షన్, మధుమేహం, క్షయ వంటి వ్యాధుల నిర్మూలన, వ్యవసాయ రంగం అభివృద్ధి వంటి కార్యక్రమాలు నీతి ఆయోగ్ ద్వారా చేపట్టనున్నామని తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో మరిన్ని మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన వీసీ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ కె హరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమాల్లో భాగంగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్‌రాజుపాల్గొన్నారు.