భక్తుల సౌకర్యార్ధం ఆలయ అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:16 PM
భక్తుల సౌకర్యార్ధం ఆలయ అభి వృద్థికి చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొ న్నారు. శనివారం మండలంలోని వేలాలలో గల గట్టు మల్లన్న స్వామి ఆల యాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, డీసీసీ అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డితో కలిసి సందర్శించారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జైపూర్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : భక్తుల సౌకర్యార్ధం ఆలయ అభి వృద్థికి చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొ న్నారు. శనివారం మండలంలోని వేలాలలో గల గట్టు మల్లన్న స్వామి ఆల యాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, డీసీసీ అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డితో కలిసి సందర్శించారు. మల్లన్న స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఎంపీ మాట్లాడుతూ గట్టు మల్లన్న స్వామి ఆలయ అభివద్ధికి అధికారుల స మన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు. రహదారి ఏర్పాటుకు అవసర మైన అటవీ శాఖ అనుమతుల ప్రక్రియను త్వరగా చేపట్టాలని సూచిం చారు. ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. ఎం పీల్యాడ్స్ కింద నిధులు కేటాయించి ఆలయ పరిధిలో అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో వేలాల గ్రామ సర్పం చు డేగ స్వప్ననగేష్, డిప్యూటి తహసీల్దార్ సంతోష్, ఇందారం కార్యదర్శి సుమన్ పాల్గొన్నారు.