ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయాలి
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:35 PM
రైతులు అధిక దిగుబడులు ఇచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయాలని కలెక్టర్ కుమార్ దీపక్, సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. బుధవారం మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిలుగా హాజరై మా ట్లాడారు.
కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : రైతులు అధిక దిగుబడులు ఇచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయాలని కలెక్టర్ కుమార్ దీపక్, సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. బుధవారం మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిలుగా హాజరై మా ట్లాడారు. పంటల సాగు విషయంలో రైతులు వ్యవసా య అధికారుల, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవాలని పేర్కొన్నారు. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు నిర్మాణం పూర్త యితే సిర్పూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. రైతులు ఉద్యానవన పంటలతో పాటు అధిక దిగుబడులు ఇచ్చే లాభదాయక పంటలను సాగు చేయాలని సూచించా రు. ఫర్టిలైజర్స్, సేంద్రీయ వ్యవసాయం, ఫాంఆయిల్ సా గు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు, మత్య్సశాఖకు సంబంధిం చిన ఉత్పత్తులు, వ్యవసాయానికి ఉపయోగ పడే ఎల క్ర్టానిక్ వాహనాలు రైతులు వినియోగించుకోవాలన్నా రు. సాంకేతికతతో రైతులకు కలిగే ప్రయోజనాలను వి వరించాలని, ఆధునిక వ్యవసాయ సాంకేతిక తను వి నియోగించుకోవడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకుని, ఉత్పాదకతను పెంచుకోవచ్చ న్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్ పరిస్థితులు, పంటలకు లభించే ధరలు, సాగు వ్యయం నీటి లభ్యత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అధిక లాభాలను అందించే పంటలను సాగు చేయాలన్నారు. ఆయిల్‌ఫాం, పందిరి సాగు, పండ్ల సాగు వంటి పంటలపై దృష్టి సారించేలా రైతులను అధికారులు ప్రో త్సహించాలన్నారు. లక్షెట్టిపేటలో విత్తనశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులు తెలు సుకోవాలని తెలిపారు. అనంతరం ఉత్తమ రైతులకు కలెక్టర్ అవార్డులు అం దజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, ట్రైనీ కలెక్టర్ విలాయత్ అలీ, కేవీకే ఇన్‌చార్జీ కో ఆర్డినేటర్ మహేష్, మార్కెట్ కమిటీ చై ర్మన్ సుకుమారి, ఆత్మ చైర్మన్ సత్తయ్య, హన్మంతు, మురళి, రఘునం దన్ రెడ్డి, బానేష్, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.