Share News

రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:38 PM

వా నాకాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా వ్యవసాయ శాఖ అధికా రులు సమన్వయంతో పని చేయాలని కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ఆదే శించారు.

రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలి
వ్యవసాయ అఽధికారుల సమీక్షలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : వా నాకాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా వ్యవసాయ శాఖ అధికా రులు సమన్వయంతో పని చేయాలని కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ఆదే శించారు. హైదరాబాద్‌లోని తన నివాసం లో ఆయన వ్యవసాయ శాఖ అధికారుల తో పలు అంశాలపై చర్చించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి మా ట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సాగు ప్రారం భానికి ముందే అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా చూడాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ సమావేశంలో వ్యవసాయ శాఖకు చెందిన వివిధ మండలాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:38 PM