kumaram bheem asifabad-గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 13 , 2026 | 10:14 PM
రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేకుండా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాల యం నుంచి శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృస్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, వ్యవసాయ శాఖ కమీషనర్ గోపి, నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్‌తో కలిసి వీసీ ద్వారా జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్‌లు, పౌర సరఫరాలు, వ్యవసాయ, నీటి పారుదల, మార్కెటింగ్, తూనికలు కొలతల శాఖ అధికారులతో ఎల్‌పీజీ సిలిండర్ల నిలువలు, సాగునీటి ప్రాజెక్టులలో నీటివ నిలువలు, రబీ పంటల సాగు, ధాన్యం కొనుగోలు కార్యచరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు
ఆసిఫాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేకుండా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాల యం నుంచి శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృస్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, వ్యవసాయ శాఖ కమీషనర్ గోపి, నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్‌తో కలిసి వీసీ ద్వారా జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్‌లు, పౌర సరఫరాలు, వ్యవసాయ, నీటి పారుదల, మార్కెటింగ్, తూనికలు కొలతల శాఖ అధికారులతో ఎల్‌పీజీ సిలిండర్ల నిలువలు, సాగునీటి ప్రాజెక్టులలో నీటివ నిలువలు, రబీ పంటల సాగు, ధాన్యం కొనుగోలు కార్యచరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని అన్నారు. ఆయిల్ కంపనీలలో ప్రతి రోజు అధికారులు సమీక్షించాలని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎల్‌పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి రోజు సమీక్షించుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా ఎండి పోవడానికి వీలులేదని, ప్రాజెక్టులలో సాగునీటికి, తాగునీటికి సరిపడా నీరు నిలువ ఉందని చెప్పారు. ఈ నీటిని సక్రమంగా వినియోగించుకునేలా కార్యచరణ రూపొందించాలన్నారు. యాసంగి పంటల సాగులో భాగంగా వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు సాగు చేస్తున్నారని అన్నారు. తదనగుణంగా విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలోని వీసీ హాల్ నుంచి కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్‌పీజీ సిలిండర్లు అవసరానికి సరిపడా నిలువలు ఉన్నాయని అన్నారు. ఎల్‌పీజీ సిలిండర్ల డీలర్లతో సమావేశం నిర్వహించి బుక్కింగ్, నిలువలపై సమీక్షిస్తున్నామని తెలిపారు. కృత్రిమ కొరత సృస్టించే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. యాసంగిలో వరి, మొక్కపజొన్న, ఇతర కూరగాయల పంటలు సాగులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టులలో సాగునీటికి, తాగునీటికి సరపడ నిలువలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఈఈలు గుణవంతరావు, ప్రబాకర్, వ్యవసాయాధికారి వెంకటి, పౌరసరఫరాల అధికారి వసంతలక్ష్మి, మార్కెటింగ్, తూనికలు కొలతల శాఖాధికారులు పాల్గొన్నారు.