సమ్మెకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:05 PM
సింగరేణి సంస్థ ప్రయోజనాల ను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 12న జరిగే సమ్మెకు కార్మికులు దూరంగా ఉం డాలని, కార్మిక సంఘాలు కూడా సహకరించాలని మందమర్రి జీఎం రాధాకృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక జీఎం కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
మందమర్రి జీఎం రాధాకృష్ణ
మందమర్రిటౌన్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : సింగరేణి సంస్థ ప్రయోజనాల ను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 12న జరిగే సమ్మెకు కార్మికులు దూరంగా ఉం డాలని, కార్మిక సంఘాలు కూడా సహకరించాలని మందమర్రి జీఎం రాధాకృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక జీఎం కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మంద మర్రిఏ రియా పరిస్థితి బాగా లేదన్నారు. ఈసమ్మె వల్ల ఉత్పత్తి రూపేణా రూ. 70 కోట్లు, వేతనాల రూపంలో రూ. 12 కోట్లు నష్టపోవాల్సి ఉంటుంది. సమావేశంలో ఏఐ టీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, ఎస్‌వోటూ జీఎం ప్రసాద్, డీజీఎం పర్సనల్ అశో క్, ఐఎన్‌టీ యూసీబ్రాంచ్ సెక్రటరీ దేవి భూమయ్య పాల్గొన్నారు.
ఫసంస్థ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ఉద్యోగులకు క్యాంటీన్‌లో మంచి రు చికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని జీఎం రాధాకృష్ణ తెలిపారు. మంగ ళవారం ఏరియాలోని కేకే ఓసీపీలో ఉద్యోగులకు లంచ్‌బ్రేక్ ప్రారంభానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా క్యాంటీన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రాజెక్టు ఆఫీసర్ మల్ల య్య, మేనేజర్ రామరాజు, గుర్తింపు సంఘం పిట్ కార్యదర్శి కుమారస్వామి పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ : లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 12న నిర్వ హించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి జేఏసీ నాయకు లు ఏఐటీయూసీ ఉప ప్రధాన కందికట్ల వీరభద్రయ్య, ఐఎన్‌టీయూసీ కేంద్ర సీని యర్ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్ రావు, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయ కుడు శ్రీనివాస్ కోరారు.