Share News

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:19 PM

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని లేకపోతే వారిపై కఠిన శిక్షలు తీసుకొని జైలుకు పంపిస్తామని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌కిషోర్‌ ఝా అన్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
డి అడిక్షన్‌ సెంటర్‌ను సందర్శిస్తున్న సీపీ అంబర్‌ కిషోర్‌ఝా

సీపీ అంబర్‌ కిషోర్‌ఝా

మంచిర్యాలక్రైం,జూన్‌5(ఆంధ్రజ్యోతి): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని లేకపోతే వారిపై కఠిన శిక్షలు తీసుకొని జైలుకు పంపిస్తామని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌కిషోర్‌ ఝా అన్నారు. శుక్రవారం డీసీపీ భాస్కర్‌తో కలిసి డీ అడిక్షన్‌ సెంటర్‌ను సందర్శించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి నిర్మూలనతో పాటు గంజాయికి బానిసైనవారిలో మార్పు తీసుకరావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ ఆసుపత్రులో డి అడిక్షన్‌ కేంద్రాన్ని ప్రారంభించారన్నారు. గంజాయికి బానిసైనవారిని డి అడిక్షన్‌ సెంటర్‌కు పంపించామన్నారు. 15 రోజుల పాటు చికిత్సను అందించి వారిలో సానుకూల మార్పు తీసుకరావాలని ఆకాంక్షించారు. మత్తు పదార్థాల సరఫరా దారులపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగుతుందని డ్రగ్స్‌ రహిత కమిషనరేట్‌ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏసీపీలు ప్రకాశ్‌, కిరణ్‌ కుమార్‌, వెంకటేశ్వర్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 11:19 PM