Share News

22న ప్రజా యుద్ధనౌక గద్దర్‌ విగ్రహావిష్కరణ

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:29 PM

ఈ నెల 22వ తేదీన అచ్చంపేటలో ప్రజాయుద్ధ నౌ క గద్దర్‌ విగ్రహావిష్కరణ ఉంటుందని ప్రజా సంఘాల నాయకులు నల్లగొండ శ్రీనివాసులు, బెక్కం జనార్దన్‌ అన్నారు.

22న ప్రజా యుద్ధనౌక గద్దర్‌ విగ్రహావిష్కరణ
గద్దర్‌ విగ్రహావిష్కరణ సభ కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ప్రజా సంఘాల నాయకులు

లింగాల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 22వ తేదీన అచ్చంపేటలో ప్రజాయుద్ధ నౌ క గద్దర్‌ విగ్రహావిష్కరణ ఉంటుందని ప్రజా సంఘాల నాయకులు నల్లగొండ శ్రీనివాసులు, బెక్కం జనార్దన్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఈ నెల 22న అచ్చంపేటలో గద్దర్‌ విగ్రహావిష్కరణ సభ సందర్భంగా నిర్వహించనున్న సభకు సబంధిం చిన కరపత్రాలను వారు విడుదల చేశారు. వా రు మాట్లాడుతూ ప్రజాకవి గద్దర్‌ ప్రజలను చైతన్య చేయడంలో పాటల రూపంలో కీలక పా త్ర పోషించారని తెలిపారు. గద్దర్‌ విగ్రహా విష్కర కార్యక్రమానికి ప్రజలు, కళాకారులు, ప్ర జా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తర లి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని కోరారు. కార్యక్రమంలో విగ్రహావిష్కరణ క మిటీ కన్వీనర్‌ జక్క గోపాల్‌, గంటల మోహన్‌, పాండు, గాలేటి లింగస్వామి, శ్రీశైలంగౌడ్‌, పట్ట ణ అధ్యక్షుడు వెంకటయ్య, బాలాజీ నాయక్‌, చె న్నదాస్‌, మల్లేష్‌, కుర్వ శ్రీశైలం పాల్గ్గొన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 11:30 PM