Share News

ముగిసిన రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఓట్ల లెక్కింపు

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:19 AM

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు ప్రిఫరెన్సియల్‌ ఓటింగ్‌ విధానంలో నిర్వహించిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ముగిసింది.

ముగిసిన రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఓట్ల లెక్కింపు

  • 23 మంది సభ్యుల ఎన్నిక

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు ప్రిఫరెన్సియల్‌ ఓటింగ్‌ విధానంలో నిర్వహించిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ముగిసింది. సమారు నెలన్నర పాటు ఓట్ల లెక్కింపు జరిగింది. కటాఫ్‌ ఓట్లు సాధించిన 23 మంది అభ్యర్థులను బార్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఎన్నికయినట్లు ప్రకటించారు. గెలిచిన వారిలో పొన్నం అశోక్‌గౌడ్‌, జాకీర్‌ హుస్సేన్‌ జావిద్‌, ఆకుల మహేశ్‌కుమార్‌, ఏ అనంతసేన్‌రెడ్డి, టీ హన్మంత్‌రెడ్డి, కే సునీల్‌గౌడ్‌, జీ కిరణ్‌కుమార్‌, చలకాని వెంకట్‌యాదవ్‌, వేరోస్‌ రఘునాథ్‌, ఎం సహోదర్‌రెడ్డి, సాముల రాంరెడ్డి, దన్వాడ మధుసూదన్‌రావు,. ఎంఏకే ముఖీద్‌, జీ అనిల్‌కిరణ్‌కుమార్‌, మందాడపు శ్రీనివాసరావు, డీ జగదీశ్వర్‌రావు, గోకుల్‌ రామారావు, డీ రాఘవులు ఉన్నారు. మహిళల కోటాలో భాను చంద్రిక, సీహెచ్‌ శైలజ, పరిపూర్ణ శనిగరం, పాశం సుజాత, బీ సునీత ఎన్నికయ్యారు. మరో ఇద్దరు సభ్యులను నామినేట్‌ చేయాల్సి ఉంది.

Updated Date - Mar 25 , 2026 | 04:19 AM