Share News

డీమ్డ్‌ వర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:03 AM

డీమ్డ్‌ వర్సిటీలకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కానుంది. ఈ మేరకు యుజిసి-2023 నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది..

డీమ్డ్‌ వర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

  • కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): డీమ్డ్‌ వర్సిటీలకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కానుంది. ఈ మేరకు యుజిసి-2023 నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ విద్యాసంస్థలు కూడా డీమ్డ్‌ వర్సిటీలుగా మారేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారికంగా ప్రకటించే వరకు ఆయా విద్యాసంస్థలు విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి ఉండదు. మూడేళ్ల కాలవ్యవధికి అనుమతి పత్రం జారీ చేస్తారు. ఉపకులపతుల ఎంపికలోనూ మార్పులు చేశారు. ప్రభుత్వ నియంత్రణలో లేదా ప్రభుత్వం నుంచి 50శాతానికి పైగా నిధులు పొందుతున్న విద్యాసంస్థల్లో ఎంపిక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులతో డీమ్డ్‌ వర్సిటీల్లో పారదర్శకత, నాణ్యత పెరుగుతుందని కేంద్రం తెలిపింది. తాజా నిబంధనలతో డీమ్డ్‌ వర్సిటీలకు దరఖాస్తు చేసుకున్న కాలేజీ యాజమాన్యాల్లో నిరాశ నెలకొందని సమాచారం. తమకు డీమ్డ్‌ వర్సిటీ హోదా ఇవ్వాలంటూ రాష్ట్రం నుంచి 10 ఇంజినీరింగ్‌ కాలేజీలు కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. తమ అనుమతి లేకుండా డీమ్డ్‌ వర్సిటీలకు అనుమతులు ఎలా ఇస్తారంటూ ఇప్పటికే తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు కేంద్రానికి అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో తాజా సవరణలు చేసింది.

Updated Date - Apr 24 , 2026 | 04:03 AM