kumaram bheem asifabad- ఆన్‌లైన్ షాపింగ్ మొదలుకొని..
ABN , Publish Date - Nov 25 , 2026 | 10:42 PM
: ఒకప్పుడు జనం తమ ప్రియతములకు ఉత్తరాలను పోస్ట్ చేసే వారు. ఇప్పుడు కాలం మారిపోయింది. కమ్యూనికేషన్ వివ్లవం నడుస్తోంది. పోస్టర్ సర్వీస్ ఇప్పుడు కూడా ఉంది. కానీ ఉత్తరాలు పంపే కాలం గతించిపోయింది. తపలా సేవలు ఇప్పటికీ వినియోగమవుతున్నాయి. ఆన్‌లైన్ డెలివరీ ద్వారా వస్తువులను ఆర్డర్ చేసే విధానంలోనూ పిన్ కోడ్ అత్యంత ముఖ్యమైనది. కాగా ఏ ప్రదేశానికి సంబంధించిన పిన్‌కోడ్ ఎలా నిర్ణయి స్తారో.. ఆ సంఖ్యల అర్థం ఏమిటో తెలుసుకుందాం.
వాంకిడి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు జనం తమ ప్రియతములకు ఉత్తరాలను పోస్ట్ చేసే వారు. ఇప్పుడు కాలం మారిపోయింది. కమ్యూనికేషన్ వివ్లవం నడుస్తోంది. పోస్టర్ సర్వీస్ ఇప్పుడు కూడా ఉంది. కానీ ఉత్తరాలు పంపే కాలం గతించిపోయింది. తపలా సేవలు ఇప్పటికీ వినియోగమవుతున్నాయి. ఆన్‌లైన్ డెలివరీ ద్వారా వస్తువులను ఆర్డర్ చేసే విధానంలోనూ పిన్ కోడ్ అత్యంత ముఖ్యమైనది. కాగా ఏ ప్రదేశానికి సంబంధించిన పిన్‌కోడ్ ఎలా నిర్ణయి స్తారో.. ఆ సంఖ్యల అర్థం ఏమిటో తెలుసుకుందాం. భారతదేశంలో పిన్‌కోడ్ (పోస్టల్ ఇండెక్స్ నంబర్) ఆధారంగా ఒక గ్రామాన్ని లేదా ప్రాంతాన్ని ఎలా గుర్తిస్తారో తెలుసుకుందాం.. పిన్‌కోడ్ అనేది ఇండియా పోస్ట్(భారతీయ తపాలా శాఖ) ఉపయోగించే ఆరు అంకెల సంఖ్య. దీని ముఖ్య ఉద్దేశం తపాలా సేవలను క్రమబద్ధీకరించడం. దేశంలో వేరే పేరు గల ప్రాంతాల మధ్య గందరగోళాన్ని నివారించడం కోసం ఇలా కేటాయించారు. కాగా ప్రతీ పిన్ కోడ్‌ను ఒక నిర్ధిష్టమైన పోస్లాఫీసుకు కేటాుుస్తారు. ఈ పోస్టాఫీసు పరిధిలో ఆ చుట్టుపక్కల ఉండే పట్టణాలు, గ్రామాలు, ప్రాంతాలు వస్తాయి. అందువలన ఒక గ్రామం పిన్ కోడ్ తెలిస్తే ఆ గ్రామం ఏపోస్టాఫీసు పరిధిలోకి వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు. ఆరు అంకెల పిన్‌కోడ్ ఒక్కొక్కటి ఒక నిర్ధిష్ట భౌగోళిక ప్రాంతాన్ని సూచిస్తుంది. పిన్‌కోడ్ ద్వారా ఒక గ్రామాన్ని పరోక్షంగా గుర్తిస్తారు. నిర్ధిష్ట పోస్టాఫీసు పిన్ కోడ్‌లోని చివరి మూడు అంకెలు ఆ ప్రాంతంలోని ఒక నిర్ధిష్ట డెలివరీ పోస్టాఫీసును సూచిస్తాయి. గ్రామ పరిధి ప్రితి పోస్టాఫీసు దాని చుట్టు ఉన్న అనేక గ్రామాలు, కాలనీలు లేదా చిన్న పట్టణాలకు మెయిల్ డెలివరీ చేస్తుంది. ఈ గ్రామాలన్నీ ఒకే పిన్ కోడ్ పరిధిలోకి వస్తాయి. ప్రత్యేకత (యూనిక్ నెస్) ఒకే పిన్ కోడ్‌లో అనేక గ్రామాలు ఉన్నా ప్రతి గ్రామానికి పోస్టాఫీ సు రికార్డుల్లో ప్రత్యేక చిరునామా ఉంటుంది. అ యితే పిన్ కోడ్ అనేది పోస్టాఫీసు స్థానాన్ని బట్టి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ పోస్టాఫీసు డెలవరీ చేసే అన్ని గ్రామాలు ఆ ప్రత్యేక పిన్ కోడ్‌ను పంచుకుంటాయి.