మహిళల రక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:02 AM
బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ఎదురవుతున్న వేధింపులకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తెలంగాణ మహిళా భద్రతా విభాగం చేపట్టిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమానికి సామాజిక...
‘స్టాండ్ విత్ హర్’ అంటున్న ప్రముఖులు
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ఎదురవుతున్న వేధింపులకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తెలంగాణ మహిళా భద్రతా విభాగం చేపట్టిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమానికి సామాజిక, సినీ రంగ ప్రముఖులు బాసటగా నిలుస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పురుషుల ప్రవర్తన ఏ విధంగా ఉండాలనే అంశంపై ఆదివారం బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఓ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ మహిళలు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం ఏర్పడాలంటే సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. నటుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. మహిళలు తమ సమస్యలను ేస్వచ్ఛగా చెప్పుకునేలా పురుషులు నమ్మకం కలిగించాలని చెప్పారు.