Share News

kumaram bheem asifabad- సిబ్బంది సమయపాలన పాటించాలి

ABN , Publish Date - May 05 , 2026 | 10:25 PM

ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్‌ కెహరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్‌ భవనంలోని జిల్లా భూ కొలతల అధికారి కార్యాలయం, జిల్లా సహ కార శాఖ అధికారి కార్యాలయాలను కలెక్టర్‌ మంగళవారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు

kumaram bheem asifabad- సిబ్బంది సమయపాలన పాటించాలి
రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్‌ కెహరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్‌ భవనంలోని జిల్లా భూ కొలతల అధికారి కార్యాలయం, జిల్లా సహ కార శాఖ అధికారి కార్యాలయాలను కలెక్టర్‌ మంగళవారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు సిబ్బంది సమయపాలన పాటించాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సయయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈవీఎం గోదాంకు పటిష్ట భద్రత

జిల్లా కేంద్రంలో గల ఈవీఎం భద్ర పరిచిన గోదాంకు పటిష్ట భద్రత కల్పించడం జరుగుతుందని కలెక్టర్‌ హరిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో గల ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలను భద్ర పరిచిన గోదాంను నెలవారి తనిఖీలో భాగంగా సందర్శించి సీసీ కెమెరాల పని తీరు, గేటుకు వేసిన సీలును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గోదాం వద్ద పటిష్ట భద్రత కల్పించడం జరుగుతుందని 24 గంటల పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ జమీల్‌, నాయబ్‌ తహసీల్దార్‌ శ్యాంలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2026 | 10:25 PM