జేఈఈ మెయిన్ ఫలితాలలో ఎస్సార్ ప్రభంజనం
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:27 AM
జేఈఈ మెయిన్-2026 ఫలితాలలో ఎస్సార్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుత విజయం సాధించినట్లు ఎస్సార్...
హసన్‌పర్తి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్-2026 ఫలితాలలో ఎస్సార్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుత విజయం సాధించినట్లు ఎస్సార్ విద్యా సంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి తెలిపారు. మే 17న జరిగే జేఈఈ (అడ్వాన్స్‌డ్)-2026కు ఇప్పటి వరకు తమ విద్యా సంస్థలనుంచి 3560 మందికిపైగా విద్యార్థులు అర్హత సాధించి రాష్రంలోనే అగ్రగామిగా నిలిచినట్లు వెల్లడించారు. జేఈఈ మెయిన్స్ ఫలితాలలో అన్ని కేటగిరీలలో కలిపి ఎస్సార్ విద్యా సంస్థలకు చెందిన పెండెం శ్రీచరణ్ 1వ ర్యాంకు, డి.త్రిశల్ 42వ ర్యాం కు, ఎన్.మైత్రేయి 45వ ర్యాంకు, ఎల్.దివిజ జ్యోతిర్మయి 142వ ర్యాంకు, ఎం.శ్రీధర్ 162వ ర్యాంకు, కె.ప్రణయ్‌కుమార్ 178వ ర్యాంకు సాధించి ఎస్సార్ కీర్తి ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలబెట్టారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్ డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతో్‌షరెడ్డితో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.