Share News

శ్రీశైలంలో 40టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వలు

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:23 AM

శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 40 టీఎంసీల నిల్వ నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలకు...

శ్రీశైలంలో 40టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వలు

  • వరద నీరు వచ్చే వరకు తప్పని తిప్పలు

బ్రహ్మగిరి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 40 టీఎంసీల నిల్వ నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను 40.4514 టీఎంసీలు నిల్వ ఉంది. 885 అడుగులకు గాను 819.50 అడుగుల దిగువకు చేరింది. ఎంజీకేఎల్‌ఐ కాలువ ద్వారా 1600 క్యూసెక్కుల నీటిని ఎత్తి పోస్తుండగా, 298 క్యూసెక్కుల నీరు అవిరి రూపంలో తగ్గిపోతుండగా, ఎగువ ప్రాంతంలో ఉన్న కాలువల ద్వారా 1193 క్యూసెక్కుల నీరు కృష్ణానదికి చేరుతున్నట్లు డ్యాం గేజింగ్‌ అధికారులు తెలిపారు. తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాలకు తాగు, సాగు నీటి అవసరాలకు శ్రీశైలం ప్రధానమైన ఆధారం కాగా, ఇటీవల ఇరు రాష్ట్రాలు కృష్ణా యాజమాన్య బోర్డుకు ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 2రోజుల క్రితం కేఆర్‌ఎంబీ బృందం శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించి ఇరు రాష్ట్రాల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి నీటి నిల్వలు అడుగంటుతున్న తరుణంలో కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశించారు.

Updated Date - Apr 24 , 2026 | 04:23 AM