kumaram bheem asifabad-ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
ABN , Publish Date - Mar 27 , 2026 | 10:37 PM
కాగజ్‌నగర్‌లో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని వివిధ ఆలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కాగజ్‌నగర్ సర్‌సిల్క్ రాంమందిర్ ఆలయం, రైల్వే స్టేషన్ కోదండ రామాలయం, శ్రీ కన్యాక పరమేశ్వరి ఆలయం, ఈఎస్‌ఐలోని హనుమాన్ ఆలయంలో, టెంపుల్ కాంప్లెక్సులోని ఆలయంలో, శ్రీ బ్రహ్మంగారి ఆలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలు అట్టహాసంగా వేద పండితులు నిర్వహించారు
కాగజ్‌నగర్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని వివిధ ఆలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కాగజ్‌నగర్ సర్‌సిల్క్ రాంమందిర్ ఆలయం, రైల్వే స్టేషన్ కోదండ రామాలయం, శ్రీ కన్యాక పరమేశ్వరి ఆలయం, ఈఎస్‌ఐలోని హనుమాన్ ఆలయంలో, టెంపుల్ కాంప్లెక్సులోని ఆలయంలో, శ్రీ బ్రహ్మంగారి ఆలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలు అట్టహాసంగా వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజ కార్యక్రమం నిర్వహించి కళ్యాణ తంతు కార్యక్రమాన్ని చేపట్టి ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.మండల కేంద్రంలోని ఆలయంలో శ్రీరాముడి కల్యాణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆనంతరం భక్తులకు జన్నావార్ అనిల్ కుమార్ కుటుంబాం ఆనదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ గ్రామ పటేల్ ఆత్రం సురేఖ ఆనంద్‌రావు దంపతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లో శుక్రవారం సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల కేందంలో సీతారాముల విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఎస్సై రవికుమార్, సీఐ రమేశ్ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు గోలేటి, నవేగాం గ్రామాల్లోని కోదండరామాలయాలలో భక్తజన సందోహం మధ్య సీతారాముల కల్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌లు బాబురావు, భరద్వాజ్‌లతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండల కేంద్రంతో పాటు ఎల్కపల్లి, చిన్నసిద్దాపూర్, సలుగుపల్లి, పాపన్నపేట, అంబగట్టు, బారెగూడ, మర్తిడి తదితర గ్రామాల్లో శుక్రవారం సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. బెజ్జూరు, ఎల్కపల్లి, చిన్న సిద్దాపూర్ తదితర గ్రామాల్లో ఎమ్మెల్సీ దండె విఠల్ పాల్గొని పూజలు నిర్వహించారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు లగ్గాం, అయినం, చిన్న రాస్పెల్లి, కుంచెవెల్లి, ఖర్జీ, గిరివెల్లి, హత్తిని గ్రామాల్లో ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా సీతారాముల కల్యాణ వేడుకలను భాజాభజంత్రీలు, మేళతాళాల చప్పుళ్లు, వేధమంత్రాల సాక్షిగా వైభవంగా జరిపించారు. కర్జెల్లి ఓంకార ఆశ్రమం, డబ్బా, గూడెం, హెటిగూడెం, దిందా, బాబాసాగర్ తదితర గ్రామాల్లో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. ఎమ్మెల్సీ దండె విఠల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు ఎల్లూరు, చెడ్వాయి, లోడ్‌పల్లి, కొండపల్లి, తదితర గ్రామాల్లో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. అనంతరం ఆలయ ప్రాంగణాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్ పాల్గొని పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ రామాలయంలో కల్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు గంభీరావుపేట గ్రామాల్లోని కోదండరామాలయాలలో భక్తజన సందోహం మధ్య సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ అన్న సైన్యం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, క్రీడాకారులకు టీ షర్టులు పంపిణీ చేశారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని గోయగాం, సావర్‌ఖేడ, ఇందాపూర్, నిశాని, కైరి, అనార్‌పల్లి, సాంగ్వీ, కేలి(కె), కేలి(బి) గ్రామాల్లోని ఆలయాల్లో కన్నల పండవగా సీతారాముల కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ శంకర్, గ్రామస్తులు పాండురంగ్, అశోక్, గోపాల్, రాందాస్, బాపూజీ తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కోదండరామయాలంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం అన్నదానం, శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రమాదేవి దంపతులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, నర్సింహస్వామి, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.