Share News

మాకు తెలుగు నేర్పించండి

ABN , Publish Date - May 16 , 2026 | 04:23 AM

శ్రీలంకలో నివసిస్తున్న ఆరు లక్షల మంది తెలుగు వారి భాషా, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునేందుకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం..

మాకు తెలుగు నేర్పించండి

  • తెలుగు వర్సిటీకి శ్రీలంక వాసుల విజ్ఞప్తి

  • అక్కడ ఆరు లక్షల మంది తెలుగు వారు!

హైదరాబాద్‌ సిటీ, మే 15 (ఆంధ్రజ్యోతి): శ్రీలంకలో నివసిస్తున్న ఆరు లక్షల మంది తెలుగు వారి భాషా, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునేందుకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (తెలుగు వర్సిటీ) తోడ్పాటు అందించాల్సిందిగా సమస్త లంక తెలుగు కాంగ్రెస్‌ విజ్ఞప్తి చేసింది. ఆ సంస్థ అధ్యక్షుడు ఎం.అంబలగన్‌.. తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య వెల్దండ నిత్యానందరావుకు ఓ లేఖ రాశారు. శ్రీలంకలో ఆరు లక్షల మందికి పైగా తెలుగు మూలలున్న వారున్నప్పటికీ, ప్రస్తుత తరంలో చాలా మందికి తెలుగు మాట్లాడడం, రాయడం చేయలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. లంకలోని తెలుగు పిల్లలు, యువత కోసం ప్రత్యేక శిక్షణ, బోధనా తరగతులు నిర్వహించాలని కోరారు. తెలుగు నేర్చుకోవడానికి అవసరమైన పాఠ్యపుస్తకాలు, బోధనా సామగ్రిని అందించాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ తెలుగు బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి విద్యా వికాసానికి సహకరించాలని కోరారు. ప్రతిష్ఠాత్మకమైన తెలుగు వర్సిటీ అందించే సహకారంతోనే శ్రీలంకలో తెలుగు భాషా, సంస్కృతులుపునరుజ్జీవం పొందుతాయని అంబలగన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - May 16 , 2026 | 04:23 AM