Share News

నాసా పోటీల్లో విజేతగా శ్రీచైతన్య

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:32 AM

అమెరికా నాసా ఎన్‌ఎస్ఎస్ స్పేస్‌ సెటిల్మెంట్‌ పోటీ-2026లో తమ పాఠశాల వరుసగా 15వసారి వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచిందని శ్రీచైతన్య ...

నాసా పోటీల్లో విజేతగా శ్రీచైతన్య

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : అమెరికా నాసా ఎన్‌ఎస్ఎస్ స్పేస్‌ సెటిల్మెంట్‌ పోటీ-2026లో తమ పాఠశాల వరుసగా 15వసారి వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచిందని శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్‌ సీమ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న 31 దేశాలకు 134 విన్నింగ్‌ ప్రాజెక్టులు ప్రకటించగా అందులో భారత్‌ 80 అవార్డులు సాధించిందని, అందులో 57 అవార్డులను శ్రీచైతన్య విద్యార్థులు మాత్రమే దక్కించుకున్నారని ఆమె బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 57 అవార్డుల్లో ఆరు ప్రాజెక్టుల్లో తమ విద్యార్థులు మొదటిస్థానం, 11 ప్రాజెక్టుల్లో ద్వితీయ స్థానం, 10 ప్రాజెక్టుల్లో తృతీయ స్థానం సాధించారన్నారు. ఈ అంతర్జాతీయ పోటీల్లో తమ విద్యాసంస్థకు చెందిన 549 మంది పాల్గొన్నారని, శ్రీచైతన్య స్కూల్‌ సాధించిన విజయాలు దేశానికి గర్వకారణంగా నిలిచాయని సీమ తెలిపారు.

Updated Date - Apr 02 , 2026 | 03:32 AM