Share News

శ్రీ చైతన్య విద్యార్థుల విజయభేరి

ABN , Publish Date - May 18 , 2026 | 03:21 AM

ఎప్‌సెట్‌-2026 ఫలితాల్లో ఇంజనీరింగ్‌, అగ్రి, ఫార్మాలో టాప్‌ 10లోపు శ్రీ చైతన్య విద్యార్థులు 10 ర్యాంకులు సాధించారు. టాప్‌ 100 లోపు 93 ర్యాంకులు సొంతం చేసుకున్నారు.

శ్రీ చైతన్య విద్యార్థుల విజయభేరి

హైదరాబాద్‌ సిటీ, మే 17 (ఆంధ్రజ్యోతి): ఎప్‌సెట్‌-2026 ఫలితాల్లో ఇంజనీరింగ్‌, అగ్రి, ఫార్మాలో టాప్‌ 10లోపు శ్రీ చైతన్య విద్యార్థులు 10 ర్యాంకులు సాధించారు. టాప్‌ 100 లోపు 93 ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఇంజనీరింగ్‌లో రాష్ట్రస్థాయిలో ఎం.వంశీధర్‌రెడ్డి మూడో ర్యాంక్‌ సాధించగా.. జె.రోషన్‌ మణిదీ్‌పరెడ్డి 4వ ర్యాంకు, బి.సమీరజ్‌రెడ్డి 9 వ ర్యాంక్‌ కైవసం చేసుకున్నారు. అగ్రి/ఫార్మాలో జి.సాహితి గీతిక 3వ ర్యాంకు, అమైర్‌ అనాస్‌ 5వ ర్యాంకు, నతన్‌ షీబా జెరూషా 6వ ర్యాకు, పి.అనురాగ్‌ 7వ ర్యాంకు, బి.సాయి శరణ్‌ 8 వ ర్యాంకు, మారుతీ సత్యశ్రీకర్‌ 9వ ర్యాంకు, ఆర్‌.మోహంతి 10వ ర్యాంక్‌ సాధించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ మాట్లాడుతూ.. నిన్నటి జాతీయ స్థాయి జేఈఈ మెయిన్‌-2026 ఫలితాల్లో 300కి 300 మార్కులతో ఓపెర్‌ కేటగిరిలో రెండు ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకులు సాధించి, రాష్ట్రస్థాయి ఎప్‌సెట్‌లోనూ శ్రీ చైతన్య తన నంబర్‌ వన్‌ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉందని తెలిపారు.

Updated Date - May 18 , 2026 | 03:21 AM