‘శ్రీచైతన్య’ ప్రభంజనం
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:40 AM
ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించారని శ్రీచైతన్య విద్యాసంస్థలు ఓ ప్రకటన చేశాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించారని శ్రీచైతన్య విద్యాసంస్థలు ఓ ప్రకటన చేశాయి. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో తమ విద్యార్థి పి.ప్రియలక్ష్మి 996 మార్కులు, బైపీసీలో కె.జ్యోష్న 997 మార్కులు సాధించారని, ఫస్టియిర్ ఎంపీసీలో విశ్వతేజ్ 469, రిషాయు 469 మార్కులు సాధించారని శ్రీచైతన్య అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. ఇంటర్ ఫస్టియిర్‌లో 147 మంది విద్యార్థులు 468 మార్కులు సాధించారని, 701 మంది 467 మార్కులు సాధించారన్నారు. సెకండియర్‌లో ముగ్గురు 996, 16 మంది 995, 759 మంది విద్యార్థులు 990 మార్కులు సాధించారని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఏటా జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల్లోనూ తమ విద్యార్థులు సత్తా చాటుతున్నారని తెలిపారు.