kumaram bheem asifabad- ఎస్పీఎంలో ఎన్నికలకు బ్రేక్
ABN , Publish Date - Oct 28 , 2026 | 10:36 PM
సిర్పూరు పేపర్ మిల్లు(ఎస్పీఎం)లో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల ఆశలకు హైకోర్టులో బ్రేక్ పడింది. ఎన్నికలకు సంబంధించిన కేసును హైకోర్టు నవంబరు 16కు వాయిదా వేసింది.
- నిరాశలో మిల్లు కార్మికులు
- కొనసాగుతున్న నిరవధిక దీక్షలు
ఆసిఫాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): సిర్పూరు పేపర్ మిల్లు(ఎస్పీఎం)లో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల ఆశలకు హైకోర్టులో బ్రేక్ పడింది. ఎన్నికలకు సంబంధించిన కేసును హైకోర్టు నవంబరు 16కు వాయిదా వేసింది. దీంతో ఎన్నికల కోసం ఎదురు చూ స్తున్న కార్మికులకు నిరాశే ఎదురైంది. 2018లో ఎన్సీఎల్టీ కోర్టు జేకే యాజమాన్యానికి మిల్లును అప్పగించింది. అప్పటి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కోనప్ప పునఃప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యాజమాన్యం కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేదు. మిల్లులో క్యాంటిన్, ఇతర సదుపాయాలు లేవని, జీతాలు తగ్గించారని కార్మికు లు ఆవేదన చెందుతున్నారు.. ఎన్నికలు నిర్వహిస్తే తమ హక్కులు అమలవుతాయని వారు భావిస్తున్నా రు. 2024లో మిల్లులో 15 కార్మిక సంఘాలు ఉన్నా యి. ఇందులో కార్మికశాఖ ముందుగా అర్హులైన సంఘాలను గుర్తించాలని యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. కాని కార్మిక శాఖ అప్పటికే కార్మిక సంఘాల నుంచి వార్షిక నివేదికలు తీసుకొని పరిశీలించి అర్హత కలిగిన పది సంఘాలను గుర్తించిం ది. అనంతరం కార్మిక శాఖ సంఘాలతో సమావేశం నిర్వహించగా యాజమాన్యం హాజరు కాలేదు.
- సంఘాల గుర్తింపును..
యాజమాన్యం మిల్లులోని సంఘాల గుర్తింపును తేల్చాలంటూ హైకోర్టును ఆశ్ర యించింది. ఈ కేసు వీగిపోగా, మూడు లేబర్ కోడ్‌లలో ఐఆర్ కోడ్‌లను ఆధారంగా చేసుకొని యాజమాన్యం మరోసారి హైకోర్టులో కేసు వేసింది. కార్మిక శాఖ తరుపు న్యాయవాది ఎన్నికల ప్రక్రియ నిర్వహించబోమని కోర్టుకు చెప్పడంతో ఏటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పాడి దీక్షలను కొనసాగిస్తున్నాయి. ఈ నెల 13న కేసు బెంచ్‌మీదకు రాగా కార్మిక శాఖ అడ్వకేట్ జనరల్ హాజరై కార్మికులకు అనుకూలంగా వాదానాలు వినిపించారు. యాజమాన్యం అడ్వకేట్ మళ్లీ కౌంటర్ పిటిషన్ వేయడం కోసం సమయం కోరారు. దీంతో కేసు నవంబరు 16కు వాయిదా పడింది. దీంతో తుది తీర్పు వస్తోందని భావించిన కార్మికుల ఆశలు ఆవిరయ్యాయి. లేబర్ కోడ్ అమలయ్యే వరకు కాలయాపన చేయాలని యాజమాన్యం చూస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
యాజమాన్యం మొండి వైఖరి సరికాదు..
- అంబాల ఓదెలు, యూనియన్ నాయకుడు
ఎస్పీఎం యాజామన్యం కార్మికులపై మొండి వైఖరిని అవలంబించడం సరికాదు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించకుండా కోర్టులో కేసు వేసింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడం లేదు. మిల్లు పునఃప్రారంభమై లాభాల గడిస్తున్నా కార్మిక వర్గానికి సంబంధించిన హక్కులు, సౌకర్యాల విషయంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు.