kumaram bheem asifabad- అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:11 PM
జిల్లాలో అట్రాసిటీ బాధితులకు సత్వరమే న్యాయం, పరిహారం అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి పోలీసు, రెవెన్యూ, ఎస్సీ సంక్షేమ, శిశు సంక్షేమ, డీవీఎంసీ సభ్యులతో సమీక్ష నిర్వహించా
ఆసిఫాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అట్రాసిటీ బాధితులకు సత్వరమే న్యాయం, పరిహారం అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి పోలీసు, రెవెన్యూ, ఎస్సీ సంక్షేమ, శిశు సంక్షేమ, డీవీఎంసీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలకు సత్వరమే న్యాయం, పరిహారం అందజేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించార. 2025 సంవత్సరంలో 31 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. 2026 సంవత్సరంలో ఇప్పటి వరకు ఆసిఫాబాద్ డివిజన్‌లో మూడు, కాగజ్‌నగర్ డివిజన్ లో మూడు కేసులు నమోదు అయ్యాయని వివరించారు. వాటిని త్వరగా విచారించి నిందితులకు చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి నెల 30వ తేదీన ప్రతి మండలంలో పౌర హక్కుల రోజు కార్యక్రమం మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకుంటామని గ్రామీణాభివృద్ధి అధికారి తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్సీ అభివృద్ధి అధికారి అశోక్, దత్తారావు, సీఐ బాలాజీ వరప్రసాద్, డీవీఎంసీ సభ్యులు కేశవరావు, అర్జు, గంగుబాయి, అశోక్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
సదరం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులు సదరం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం శిబిరాన్ని బుధవారం కలెక్టర్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సదరం శిబిరంకు వచ్చే దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు తాగునీరు, చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంచాలని అన్నారు. స్లాట్ బుక్ చేసిన వారు సదరం శిబిరానికి వచ్చేలా పర్యవేక్షించాలన్నారు. సదరం శిబిరంలో కంటి చూపు, మానసిక వైకల్యం, సికల్ సెల్, తలసేమియా, హిమోఫిలియా, మూగ, చెవిటి, ఎముకల వైకల్యం ఉన్న వారు శిబిరాలకు హాజరై నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం రామకృష్ణ, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.