Share News

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి

ABN , Publish Date - May 13 , 2026 | 11:37 PM

: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని ముల్కల్ల, నంనూర్‌, రాపల్లిలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి
రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

హాజీపూర్‌, మే 13 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని ముల్కల్ల, నంనూర్‌, రాపల్లిలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రైతుల వద్ద నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అకాల వర్షాల కారణంగా ధాన్యం దెబ్బతినకుండా జిల్లాలోని గుర్తించిన గోదాముల్లో నిల్వ చేసి కేటాయించిన రైసుమిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు నగదు అందించే ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని వెంటనే కొనగోలు చేయాలన్నారు. ఎలాంటి అవాంతరాలు ఏర్పడినా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రైతులు తమ ట్రాక్టర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తరలించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఆయన వివరించారు.

Updated Date - May 13 , 2026 | 11:37 PM