Share News

భూముల రీ సర్వేలో వేగం పెంచాలి

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:31 PM

గ్రామంలో కొనసాగుతున్న భూము ల రీ సర్వే పనుల్లో వేగం పెంచాలని అ దనపు కలెక్టర్‌ చెన్నయ్య సూచించారు.

భూముల రీ సర్వేలో వేగం పెంచాలి
మరికల్‌లో రీ సర్వే పనుల వివరాలను అడుగుతున్న అదనపు కలెక్టర్‌ చెన్నయ్య

- అదనపు కలెక్టర్‌ చెన్నయ్య

తిమ్మాజిపేట, జూలై 28 (ఆంధ్రజ్యో తి) : గ్రామంలో కొనసాగుతున్న భూము ల రీ సర్వే పనుల్లో వేగం పెంచాలని అ దనపు కలెక్టర్‌ చెన్నయ్య సూచించారు. మండల పరిధిలోని మరికల్‌ రీ సర్వేను మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీ లించారు. ఆయన రీ సర్వేకు సంబంధిం చి పురోగతి వివరాలను మండల సర్వే యర్‌ సాయిబాబాను అడిగి తెలుసుకు న్నారు. ప్రస్తుతం గ్రామంలోని చెరువు లు, కుంటల రీ సర్వే కొనసాగుతోందని, సర్వేయర్ల కొరత కారణంగా రీ సర్వే ఆలస్యమ వుతోందని, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు రీ సర్వేకు దూరంగా ఉంటున్నారని మండల సర్వేయర్‌ తెలిపారు. రీ సర్వే పనులు పారదర్శకంగా కొ నసాగించాలని లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల సమస్యలు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని, రీ సర్వే త్వరగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అర్చన, జిల్లా సర్వే అధికారి గిరిధర్‌, తహసీల్దార్‌ జయంతి, మండల గిర్దావర్‌ అను రాధ, గ్రామ పరిపాలన అధికారి ఉన్నారు.

కమాల్‌పూర్‌ తండాలో రీసర్వే..

చారకొండ, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : మం డలంలోని కమాల్‌పూర్‌తండాను పైలెట్‌ ప్రాజె క్టుగా ఎంపిక చేసినట్లు తహసీల్దార్‌ ఉమ తెలి పారు. మంగళవారం మండలంలోని కమాల్‌ పూర్‌తండా రెవెన్యూ పరిధిలోని నూకలచింత వాడిక తండాలో సర్పంచు రవినాయక్‌ ఆధ్వ ర్యంలో రెవెన్యూ అధికారులు భూ రీసర్వే నిర్వ హించారు. తహసీల్దార్‌ ఉమ మాట్లాడుతూ ప్ర భుత్వ భూములతో పాటు చెరువుల భూము లను గుర్తించి హద్దులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భూ రీ సర్వేకు రైతులు సహకరించి తమ పొలాల హద్దులను చూయించుకొంటే శా శ్వత పరిష్కారం ఉంటుందని అన్నారు. కార్య క్రమంలో ఆర్‌ఐ భరత్‌కుమార్‌గౌడ్‌, సిర్సనగం డ్ల దేవాలయ మేనేజర్‌ నిరంజన్‌, సర్వేయర్‌ అనూష, జీపీవో మధునమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 11:31 PM