Share News

రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా.. చర్లపల్లి-విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Mar 27 , 2026 | 03:42 AM

చర్లపల్లి- విశాఖపట్నం మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా క్రమబద్ధీకరించేందుకు రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.

రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా.. చర్లపల్లి-విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): చర్లపల్లి- విశాఖపట్నం మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా క్రమబద్ధీకరించేందుకు రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌ 3నుంచి.. విశాఖపట్నం నుంచి చర్లపల్లికి ప్రతీ శుక్రవారం, 4 నుంచి.. చర్లపల్లి నుంచి విశాఖపట్నంకు ప్రతి శనివారం (18527/18528) రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లలో సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌, దివ్యాంగుల కోసం ప్రత్యేక కోచ్‌లు ఉంటాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.

Updated Date - Mar 27 , 2026 | 03:42 AM