kumaram bheem asifabad- గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక పాఠశాలలు
ABN , Publish Date - Apr 02 , 2026 | 10:21 PM
గిరిజన విద్యా ర్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే దిశగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 16 ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల్లో చదువు తున్న గిరిజన విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహించి ఎంపికైన విద్యార్థులకు ఈ పాఠశాలల్లో ప్రవేశం కల్పించి ప్రత్యేక బోధన అందించనున్నారు.
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు కార్యాచరణ
వాంకిడి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యా ర్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే దిశగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 16 ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల్లో చదువు తున్న గిరిజన విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహించి ఎంపికైన విద్యార్థులకు ఈ పాఠశాలల్లో ప్రవేశం కల్పించి ప్రత్యేక బోధన అందించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 123 గిరిజన ఆశ్రమపా ఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక పద్ధతిలో మరింత నాణ్యమైన విద్యాబోధన అందించాలనే ఉద్దేశంతో ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐటీడీఏ పరిధిలోని జిల్లా గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో సహాయ గిరిజనాభివృద్ది అధికారి ఐటీడీఏ కేంద్రాలైన ఆసిపాబాద్, కాగజ్‌నగర్, జైనూ ర్, బోథ్, ఉట్నూర్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో రెండు చొప్పున మొత్తం 16 పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్క ఏటీడీఏ పరిధిలోని బాలబాలికలకు వేర్వేరు పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. 3 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. నాణ్యమైన విద్యాబోధన, అన్ని రకాల సౌకర్యాలు కల్పించనున్నారు.
- ప్రతిభా ఆధారంగా..
విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించాలనే లక్ష్యం తో ఏర్పాటు చేస్తున్న ఈ పాఠశాలల్లో చదువుల్లో చురుకుగా ఉన్న విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని ఐటీడీఏ పీవో నిర్ణయించారు. విద్యార్థుల ఎంపికకోసం ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నారు. అందులో ప్రతిభ చాటిన విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ పాఠశాలలు ఆంగ్ల మాధ్య మంలోనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీటి కోసం ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో పనిచే స్తున్న ఉపాధ్యాయులలో విషయ నిపుణులను గుర్తించి ఈ ప్రత్యేక పాఠశాలల్లో నియమించనున్నా రు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పె ట్టుకుని వారికి ఐఐటీ, నీట్ వంటి పరీక్షలకు సన్నద్ధం చేయనున్నారు చదువుల్లో ప్రావీణ్యం చాటేలా ప్రోత్సహించి తీర్చిదిద్దడమే ఈ ప్రత్యేక పాఠశాలల లక్ష్యమని అధికారులు తెలిపారు. విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహణ తరువాత ప్రవేశాల ఎంపిక, ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 2026-27 విద్యాసంవత్సరం నుం చి ఈ పాఠశాలలను ప్రారంభించేందకు ఐటీడీఏ పీ వో ఆదేశాల మేరకు కసరత్తు చేస్తున్నట్లు అధికారు లు తెలిపారు.