శివకేశవులకు విశేష పూజలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:31 AM
యాద గిరిగుట్ట లక్ష్మీనర సింహస్వామి కొండపై సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. స్వయంభువులకు వైష్ణవ పాంచరాత్రా గమరీతిలో, పర్వతవర్థిని రామలింగేశ్వరస్వామి శివాలయంలో స్ఫటికమూర్తులకు శైవాగమశాస్త్రరీతిలో నిత్య కైంక ర్యాలు నిర్వహించారు.
యాదగిరిగుట్ట, మార్చి 9(ఆంధ్రజ్యోతి): యాద గిరిగుట్ట లక్ష్మీనర సింహస్వామి కొండపై సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. స్వయంభువులకు వైష్ణవ పాంచరాత్రా గమరీతిలో, పర్వతవర్థిని రామలింగేశ్వరస్వామి శివాలయంలో స్ఫటికమూర్తులకు శైవాగమశాస్త్రరీతిలో నిత్య కైంక ర్యాలు నిర్వహించారు. ప్రధానాలయంలో సుప్రభాత సేవతో స్వామిఅమ్మవారిని మేల్కొల్పిన అర్చకులు మూలమూర్తులను వేదమంత్ర పఠనాలు, పంచా మృతాలతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చిం చారు. సాయంత్రం అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చనలు ఆగమశాస్త్రరీతిలో కొనసాగాయి. శివాలయం ముఖ మండపంలో స్ఫటికమూర్తులను వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య పంచామృతాలతో అభిషేకించారు. ఉత్సమూర్తు(శివపార్వతి)లకు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ. 20,60,534 ఆదాయం సమకూరినట్లు ఈవో జే. భవానీశంకర్ తెలిపారు. స్వామివారి హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు.
గుట్ట పర్యవేక్షకుడి నియామకానికి కసరత్తు
యాదగిరిగుట్ట దేవస్థానంలో పర్యవేక్షకుల కొరత ఉంది. దేవస్థాన పరిధిలో 14 మంది పర్యవేక్షించాల్సిన 17 విభాగాలకు(వేములవాడ నుంచి ఇద్దరు, కొమురవెళ్లి ఒకరు) ముగ్గురు డిప్యూటేషన్‌పై రాగా 12 మంది పర్యవేక్షకులతో గోదాం, శానిటేషన్ విభాగాలకు గానూ అదనపు బాధ్యతలతో పర్యవేక్షిస్తున్నారు. 2025 జూన్‌లో వేముల వెంకటేశ్ గోదాం పర్యవేక్షుడిగా ఉద్యోగ విరమణ చేశారు. పరిపాలన విభాగం పర్యవేక్షకుడు దాసోజు నరేష్‌కు గోదాం విభాగం అదనపు బాధ్యతలు అప్పగించారు. గత నెల 28న ఆలయ పర్యవేక్షకుడు కే. నటరాజు ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం ఆలయ విభాగం స్థానంలో కొత్తగా నియమించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేములవాడ దేవస్థానం నుంచి (సీనియర్ అసిస్టెంట్ నుంచి పదోన్నతి పొందిన) బదిలీపై వచ్చిన పచ్చనూరి రాజేందర్‌కు పర్యవేక్షకుడిగా నేడో, రేపో ఆలయ బాధ్యతలు అప్పగించనున్నారు.